Rohit Sharma: రోహిత్‌కు ఒక్క ఏడాది ఇవ్వలేకపోయాం..! భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు కష్టమని అగార్కర్ వివరించారు. అయితే 16 ఏళ్లు దేశానికి సేవలందించిన రోహిత్‌కు ఏడాది కూడా ఇవ్వలేకపోయామని, ఐసీసీ టోర్నీల్లో అతని విజయాలను గుర్తించలేదని కైఫ్ అభిప్రాయపడ్డారు.
కానీ, రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించడంపై భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండే కష్టమని, అందుకే గిల్కు వన్డే కెప్టెన్సీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది వ్యూహత్మక నిర్ణయమని అన్నాడు. అయితే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మ భారత క్రికెట్కు 16 ఏళ్లు ఇస్తే.. మనం అతనికి ఒక్క ఏడాది కూడా ఇవ్వలేకపోయాం అని అన్నాడు.
రోహిత్ శర్మ దేశం కోసం 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచాడు. ఆ వెంటనే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే ఏడాది కెప్టెన్గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. ఆ టోర్నీ చివరి మ్యాచ్లో రోహిత్ శర్మనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మొత్తం 16 ఐసీసీ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కెప్టెన్గా 15 మ్యాచ్లు గెలిచాడు. ఓడిన ఆ ఒక్క మ్యాచ్ కూడా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. అలాంటి రోహిత్కు మరో ఏడాది కెప్టెన్గా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
