RRC Railway Jobs 2025: టెన్త్, ఇంటర్ పాసైన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సర్కార్ కొలువు

RRC Eastern Railway Sports Quota Recruitment 2025 Notification: 2025-26 సంవత్సరానికి సంబంధించి క్రీడా కోటా కింద రైల్వే ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో..
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నీస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్.. విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు సంబంధిత క్రీడా విభాగంలో అర్హతతోపాటు ఐటీఐ, పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే అభ్యర్థులు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొని ఉండాలి. లేదా జాతీయ, యూనివర్సిటీ స్థాయి పోటీలలో టాప్ ర్యాంకులను సాధించి ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా అక్టోబర్ 9, 2025వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ (పురుషులు) అభ్యర్ధులు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మైనారిటీలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ట్రయల్స్ తర్వాత రూ. 400 తిరిగి చెల్లిస్తారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు (ఫీల్డ్ ట్రయల్స్) నిర్వహించే అవకాశం ఉంది. క్రీడా సామర్థ్య పరీక్ష (ట్రయల్స్)కు 40 మార్కులు ఉంటాయి. అభ్యర్ధి స్పోర్ట్స్ హిస్టరీకి 50 మార్కులు, విద్యార్హతలకు 10 మార్కులు ఉంటాయి. అనంతరం డాక్యుమెంట్ వెరిఫీకేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. క్రీడా ట్రయల్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశకు పంపిస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. రూ. 18,000 నుంచి రూ. 45,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
