సైరా మీద పడనున్న సాహో ఎఫెక్ట్ : చిరు విషయంలో తగ్గనంటున్న రామ్ చరణ్

saho saira

Teluguwonders:

💥సాహో ఇచ్చిన షాక్కి ఓవర్సీస్లో ‘సైరా’కి చుక్కలు కనిపిస్తున్నాయి. Saaho Vs Sye Raa: ఒక రకంగా ‘సాహో’…‘సైరా’ను కష్టాల్లోకి నెట్టినట్టయ్యింది . సైరా అయినా సెన్సేషనల్ హిట్గా నిలిస్తే నెక్స్ట్ టాలీవుడ్ చరిష్మా నిలబెట్టడానికి ‘RRR’ ఎటూ రెడీగా ఉంది.

💥కలెక్షన్లు బాగున్నా :

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రెండ్ సెట్టర్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తాజా మూవీ ‘సాహో’ కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకి రాని భారీ బజ్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది టాలీవుడ్లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ‘సాహో’. ప్రస్తుతానికి ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నా అమ్మిన అమౌంట్ని బట్టి చూస్తే పెట్టినపెట్టుబడి రాబట్టడం కష్టంగానే ఉంది. ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రైట్స్ని దుబాయ్కి చెందిన ఫార్స్ ఫిల్మ్ 42 కోట్లకు కొని, బాలీవుడ్ దిగ్గజ సంస్థ అయిన YRF (యశ్ రాజ్ ఫిల్మ్స్)తో ఒప్పందం కుదుర్చుకుని పంపిణీ చేసింది.

‘సాహో’ మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఎక్కువ సంఖ్యలో స్క్రీన్స్లో గ్రాండ్ గానే సినిమా రిలీజ్ చేశారు.కానీ సినిమా టాక్ వల్ల ఓవర్సీస్ లో దుమ్మురేపాల్సిన సాహో చాలా సాధారణంగా వసూళ్ల నమోదు ప్రారంభించింది.ఆ ఎఫెక్ట్ ఆ తరువాత రోజుల్లో వసూళ్ల మీద కూడా ప్రభావం చూపించింది.అంతే కాదు ఆ ఎఫెక్ట్ ఆ సినిమాకే పరిమితం కాలేదు.

💥సై రా పై ఎఫెక్ట్ – అక్టోబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ మెగా హిస్టారికల్ మూవీ సైరా పై కూడా ఎఫెక్ట్ పడింది.‘సాహో’కి ముందు బెంచ్ మార్క్గా బాహుబలి-2ఫలితం ఉంది కాబట్టి, సాహోలో కూడా ప్రభాస్ హీరో కాబట్టి ధైర్యం చేశారు.

👉సాహో తర్వాత సీన్ మారింది:

కరెక్ట్ గా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాలకు బాహుబలి తెరిచిన వరల్డ్ మార్కెట్ డోర్స్ని సాహో కాస్త క్లోజ్ చేసింది. అందుకే ఇక్కడ భారీ పోటీ మధ్య అమ్ముడవుతున్న ‘సైరా’ రైట్స్కి ఓవర్సీస్లో మాత్రం డీల్ సెట్ కావట్లేదు. ఆ సినిమాకి అయిన బడ్జెట్ లెక్కకట్టుకుని ముందు ఓవర్సీస్ రైట్స్ పాతిక కోట్లు అన్నారు, కానీ ఎవరూ ముందుకురాలేదు. సర్లే కదా అని 20కోట్లకు తగ్గించారు , అయినా కూడా ఇంకా డీల్ సెట్ కాలేదు.

💥చిరు రేంజ్ తగ్గించడానికి ఒప్పుకోని చరణ్ :

‘సాహో’ని కొన్న ఫార్స్ ఫిల్మ్ సైరాకి రూ. 15 కోట్ల ఆఫర్ ఇచ్చింది. నిజానికి ఆ సినిమా రేంజ్కి అది చాలా తక్కువ. పైగా చిరు ఇమేజ్ కూడా వర్క్ అవుట్ అవుతుంది. ఇప్పడు రూ. 15 కోట్లకు ఓకే అనేస్తే సినిమా అవుట్ ఫుట్ పై వేరే అనుమానాలు ఏర్పడతాయి.అందుకే రామ్ చరణ్ ఆ డీల్ కి ఓకే చెప్పలేకపోతున్నాడు. దానికి ఓకే అనేస్తే సైరా క్రేజ్ని,చిరు రేంజ్ని స్వయంగా తగ్గించినట్టనవుతుంది. కానీ ఒకపక్క రిలీజ్ డేట్ తరుముకొస్తుంది. లేట్ అయితే సినిమా రిలీజ్ అనుకున్న రేంజ్లో జరగదు. అక్కడి వసూళ్ళకు కీలకమయిన ప్రీమియర్స్ ఏర్పట్లకు సరిపడా టైం ఉండదు. లోకల్ డీలింగ్స్ చాలానే ఉంటాయి. అది ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది.
ఇండియా వరకు సైరా హవా నడుస్తుంది. మరి నిర్మాతగా ఇప్పుడు చరణ్ ఏ స్టెప్ తీసుకుంటాడు?, సైరా రిలీజ్ ని ఓవర్సీస్ లో ఎలా ప్లాన్ చేస్తాడు అనేది ఇప్పుడు కొన్ని మిలియన్స్ డాలర్స్కి సంబందించిన విషయం. 👉ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights