టాలీవుడ్ డైరెక్టర్‌తో సల్మాన్ కొత్త సినిమా….

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను దిల్ రాజు తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్, ఈసారి భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఈ సినిమాను ప్రకటిస్తూ, వంశీ పైడిపల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. “ఈ ఏప్రిల్ నుంచి వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో కలిసి కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. తెలుగు-హిందీ ఇండస్ట్రీల కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
