వామ్మో .. జరజరా పాకేస్తోన్న సమంత

samantha fitness pics

Teluguwonders:

అక్కినేని సమంత తన నటన తోనే కాక తన ఫిట్‌నెస్ వీడియోలతో కూడా ఆశ్చర్యపరుస్తోంది . తాజా గా ఒక ఫిట్‌నెస్ వీడియో ని రిలీజ్ చేసింది . ఈ వీడియోను ప్రస్తుతం సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.ఈ పోస్ట్‌కు కాజల్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, పూజా హెగ్డే, నమ్రతా శిరోద్కర్ స్పందించారు. అద్భుతంగా ఉందంటూ వీరంతా సమంతను కొనియాడారు

🔴వివరాల లోకి వెళ్తే :

దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకున్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత మెరిగింది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేసిన సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ!’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు వీటికి ఉదాహరణలు.
తాజాగా సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో సమంతను చూస్తే ఆమె అభిమానులే కాదు ఎవరైనా షాక్ కావాల్సిందే. ప్రొఫెషనల్ అథ్లెట్ మాదిరిగా బార్స్‌ను రెండు చేతులతో పట్టుకొని జర జర పైకి పాకేస్తున్నారు. దీన్ని ‘పార్కౌర్’ అంటారట. Fitness Trainer అభినవ్ ఆధ్వర్యంలో సమంత ఈ పార్కౌర్ ఫీట్లు చేశారు. అదొక్కటే కాదు రెండు రోజుల క్రితం సమంత తన Instagram Story లో కొన్ని వీడియోలు పెట్టారు. అవి కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించినవే. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘‘కొత్తవాటిని ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడొద్దు. మీ సామర్థ్యం ఏంటో తెలిసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. పార్కౌర్ చాలా బాగుంది’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంత పేర్కొన్నారు

ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో సమంత నటిస్తున్నారు. ఈ సినిమా తప్ప మరే చిత్రాన్ని సమంత అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ పనిమీదే ఆమె చెన్నై వెళ్లారని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. సమంత Web Series రాబోతోందనే ఆనందం మాత్రం ఆమె అభిమానుల్లో ఉంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights