కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీస్ ఎంతో కొంత సహాయం చేస్తూనే వస్తున్నారు . అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా సమయంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు . తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు . అయితే ఇలాంటి సాయం చేస్తున్నప్పటికీ చిరంజీవి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్,టాలీవుడ్ నటుడు సోనుసూద్ తో పోల్చుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో ఇంత మంది ఉండగా సహాయం చేయడానికి వచ్చిన మెగాస్టార్ ని టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని ఆట సందీప్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలి.. ఆయనను విమర్శించే వాళ్ళని గట్టిగా నిలదీశారు.

ఆట సందీప్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎంతో మంది ఉండగా.. చిరంజీవి గారే ఎందుకు సహాయం చేయాలి.? ఆయన కూడా మనలాగే ఒక సాధారణ వ్యక్తి. ఏమంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.. ఇండస్ట్రీలో తను మెగా ఫ్యామిలీ అనే వృక్షాన్ని నిలిపాడు. మా తాతగారు ఇట్లా.. మా తండ్రిగారు అట్లా అని చెప్పుకుంటారు.. ఎందుకంటే వాళ్ళు అంతా కష్టపడ్డారు.. వాళ్లలా నువ్వు కూడా కష్టపడు.. అంతేగాని ఆయన విమర్శించడం సరి కాదు అంటూ నెటిజనులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆట సందీప్.

ఎటువంటి సమస్య వచ్చినా ఇండస్ట్రీలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది చిరంజీవి గారు మాత్రమే . ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టింది ఇది కూడా ఆయనే. ఆయనలా ఎవరు చేశారు? అంటూ విరుచుకు పడ్డాడు ఆట సందీప్.. ఇవన్నీ పక్కన పెడదాం.. అసలు చిరంజీవిగారు ఎందుకు సహాయం చేయాలి?? నీకు కాళ్లు ఉన్నాయి.. చేతులు ఉన్నాయి.. నీ బతుకు నువ్వు బతక లేవా? అయినా కష్టమని వస్తే లేదనుకున్న సాయం చేస్తారు చిరంజీవి గారు. ఇంత చేస్తున్న ఆయనను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.

దేశంలో ఏ మూల ఏం జరిగిన చిరంజీవి స్పందించాలా? దానికి గవర్నమెంట్ ఉంది. చిరంజీవి గారు చేయాలనుకుంటే చేస్తారు. ఆయన విమర్శించే వాళ్ళు పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళే. అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఇటీవల పావలా శ్యామల కష్టంలో ఉందంటే, ఆయన ఇదివరకే రెండు లక్షలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు లక్ష రూపాయలు సహాయం కూడా చేశారు. ఇండస్ట్రీ లో ఎవరు ఎలా ఉన్నా చిరంజీవి గారే చూసుకోవాలా.. అంటూ చిరంజీవిని విమర్శించే వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు ఆట సందీప్.

Leave a Reply