పాపం ఫీలయినట్టున్నాడు.. పక్కనే ఉన్నా పాక్ అధ్యక్షుడిని పట్టించుకోని మోదీ, పుతిన్!

చైనాలోని తియాన్‌జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు పుతిన్ షరీష్ ముందు నుంచే వెళ్తూ కనీసం అతన్ని పట్టించుకోలేదు. దీంతో పాక్ ప్రధాని షరీష్ వాళ్లను చూస్తూ పక్కనే నిలబడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
చైనాలోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీ, పుతిన్‌ను సాధరంగా ఆహ్వానించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి ముగ్గురు షెక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ముగ్గరూ అక్కడి నుంచి ముందు వెళ్లారు.
అయితే ఎస్‌సీఓ సదస్సులోని సభ్యదేశాల అధినేతలు అందూరూ గ్రూప్ ఫొటో దిగేందుకు ఒక చోటుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఏదో చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ అక్కడే నిల్చున్న ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మాత్రం వారు పట్టించుకోలేదు. దీంతో పాక్ ప్రధాని వారిని చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
