రూ.20లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరే అవకాశం!

Shamshabad Airport Journey Fare/రూ.20లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరే అవకాశం!
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే ప్రస్తుతం ప్రయాణికులు భారీ ఖర్చులు భరించాల్సి వస్తోంది. వాహనం ఏదైనా — క్యాబ్, బస్సు, లేదా ప్రైవేట్ వాహనం — ఛార్జీలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. సగటున రూ.600 నుంచి రూ.1,900 వరకు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ క్యాబ్ ఎంచుకుంటే కనీసం రూ.700 నుంచి రూ.1,900 వరకు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సుమారు రూ.350 వరకు చెల్లించాల్సి వస్తోంది.
అయితే కేవలం రూ.20 టికెట్‌తోనే విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉండి కూడా, ఆ ప్రాజెక్ట్ ఇంకా గమ్యం చేరలేదు. కారణం, ఉందానగర్ నుంచి విమానాశ్రయం వరకు కేవలం 6 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తికాకపోవడమే.
సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళే ఒక వ్యక్తి సగటున దాదాపు రూ.1,000 ఖర్చు చేస్తాడు. ఈ వ్యయం సాధారణ ప్రజలకు చాలా భారంగా మారుతోంది. ఉందానగర్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళినా, అధికంగా ఛార్జీలు వసూలవుతున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా, దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ట్రాక్ నిర్మించి, దాన్ని నేరుగా విమానాశ్రయానికి అనుసంధానించాలని 2014లో ప్రణాళిక వేసింది. మొత్తం ప్రాజెక్టుకు రూ.180 కోట్లు అంచనా వేశారు. ఉందానగర్ వరకు పనులు పూర్తయినా, విమానాశ్రయానికి మిగిలిన 6 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణానికి జీఎంఆర్ సంస్థ అభ్యంతరం తెలిపడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
