దేవుడికి కొబ్బరి కాయను ఎందుకు కొట్టాలి.. కొబ్బరికాయ కొట్టడం అసలు ఎప్పుడు మొదలు అయ్యింది…

కొబ్బరికాయ దేవుడికి ప్రతిరూపం. కొబ్బరికాయ మరొక పేరు శ్రీఫలం . శ్రీఫలం అంటే.. దేవుడి ఫలం అని అర్థం. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు.. కానీ కొబ్బరికాయ ఎందుకు వాడతామో మాత్రం మనలో చాలామందికి తెలీదు.అసలు
✡కొబ్బరి కాయ దేనికి గుర్తు : హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి.
✡కొబ్బరి కాయను కొట్టడం ఇలా మొదలయ్యింది :కొబ్బరి కాయను పూర్వకాలంలో చాలా మంది, చాలా సందర్భాల్లో నరబలి ఇచ్చేవాళ్లు. అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు. ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పిన వారు జగద్గురు ఆది శంకర చార్యుల వారు. నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించాల ని చెప్పి ఆది శంకరులు ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టారు .

✡కొబ్బరికాయ కొట్టడం లో అర్ధం ఇది :
కొబ్బరికాయ పగలగొట్టడం వెనక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయను పగులకొడితే.. మనుషుల అహం, తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
