Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆయుధపూజ

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గధం, శరం, విల్లంబు, సుదర్శ చక్రంతో పాటు ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు.
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గధం, శరం, విల్లంబు, సుదర్శ చక్రంతో పాటు ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ పర్యవేక్షణలో పురోహితులు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమం జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఫలాలను నివేదన చేశారు. మూడు రోజుల పాటు ఉభయ సంధ్యలలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి ఆయుధాలను స్వయంగా చూసిన భక్తులు తరించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
