గరం మసాలా లేకుండానే సూపర్ టేస్ట్.. ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి!

చికెన్ కర్రీ అంటే ఇంట్లో అందరికీ ఫేవరెట్ డిష్. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్త స్టైల్‌లో చేస్తే రుచి మరింత బాగుంటుంది. గరం మసాలా లేకుండానే ఈ చికెన్ కర్రీను సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు.
ఈ కర్రీ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా సహజమైన రుచితోనే ఘుమఘుమలాడే ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేయిస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది.
ముందుగా నూనెలో ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా వేసి బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత మిరపపొడి, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి, చికెన్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మూతపెట్టి ఉడికిస్తే చాలు.. సూపర్ టేస్ట్‌తో చికెన్ కర్రీ రెడీ అవుతుంది.
ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరీ, బగారా అన్నింటికీ బాగా సరిపోతుంది. సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూస్తే, మళ్లీ మళ్లీ ఇదే స్టైల్‌లో చేయాలని అనిపిస్తుంది
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
