Singer : 50 వేలకు పైగా పాటలు.. ఎన్నో అవార్డులు.. లెజండరీ సింగర్.. ఇప్పటికీ సినిమాల్లో..

భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన లెజండరీ సింగర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వేలాది పాటలు పాడింది. బుజ్జాయిగా, 80 ఏళ్ల ముసలమ్మాల ఎంతో చక్కగా పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఇంతకీ ఈ లెజెండరీ సింగర్ ఎవరో గుర్తుపట్టారా.. ?
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి భారతీయ సినిమా ప్రపంచంలో అద్భుతమైన సింగర్. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ ఇలా దాదాపు 17 భాషలలో మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడారు. తన మధురమైన గాత్రంతో సినీప్రియులను ఊర్రూతలూగించారు. ఆమె భారతదేశపు ప్రసిద్ధ చలనచిత్ర గాయని, నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ శ్రోతలను అలరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె.. మొదట పాడిన పాట విషాద గీతం కావడం విచిత్రం. ఆమె మరెవరో కాదండి.. లెజండరీ సింగర్ ఎస్. జానకి. చిన్న వయసులోనే 1957లో తెలుగు సంగీత దర్శకులు టి. చలపతి రావు స్వరకల్పనలో రూపొందించిన తమిళ చిత్రం విధియిన్ విలయాట్టు చిత్రంలో ఆమె తొలిసారిగా పాట పాడారు. ఆ త్రవాత యమ్.ఎల్.ఏ అనే సినిమాలో నీ ఆశా అడియాస.. నీ దారే మణిపూస .. అనే పాటను తెలుగులో మొదటిసారి పాడారు. 25 సంవత్సరాలలోనే ఆమె దక్షిణ భారత భాషల్లోనే కాకుండా కొంకణి, తుళు, సౌరాష్ట్ర, హిందీ, బెంగాలీ, సంస్కృతం, సింహళ, ఆంగ్ల భాషలలో కూడా వేలాది పాటలు పాడారు.
1992లో శ్రీలంకలో “జ్ఞాన గణ సరస్వతి” బిరుదు అందుకున్నారు. 1986లో తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డు, 2002లో కేరళ రాష్ట్ర ప్రత్యేక అవార్డు, నాలుగుసార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు, 1980లో మలయాళ చిత్రానికి, 1984లో ఒక తెలుగు చిత్రానికి జాతీయ అవార్డును అందుకుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును పద్నాలుగు సార్లు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును ఏడు సార్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును పది సార్లు గెలుచుకున్నారు. అనేక భాషలలో కలిపి దాదాపు 50వేలకు పైగా పాటలు పాడారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించాలనుకుంది. కానీ ఆమె దానిని తిరస్కరించింది.
సినీప్రయాణంలో ఆమె యాబై సంవత్సారుల పూర్తి చేసుకున్న జానకి.. తన గానానికి వీడ్కోలు పలికారు. 80 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల అమ్మాయిల అందమైన గాత్రంతో అబ్బురపరిచింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఎస్.జానకి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
