Snake Rescue Video: ప్రాణాలకు తెగించి పాముకు కాపాడిన వ్యక్తి.. వీడియో చూస్తే..

andhra-news-8

Snake Rescue: పాము కనిపించగానే పరుగులు పెడతాం.. ఆ పేరు వింటేనే కొంతమంది ఒళ్ళు జలదరిస్తుంది.. కొన్ని సందర్భాల్లో ఆ పాము వల్ల హాని కలుగుతుందేమోనని కొట్టి చంపేసే ఘటనలు కూడా ఉన్నాయి. కానీ.. ఆపదలో చిక్కుకొని రక్షించి.. గాయపడిన ఆ పాముకు ఏకంగా సర్జరీ చేసియడం మీరెప్పుడైనా చేశారా? లేదు కదూ అయితే లేటెందుకు చూద్దాం పదండి.

సాదారణంగా పాము పేరు వింటేనే కొందరు భయంతో వణికిపోతారు.. ఇక అది కినిపిస్తే ఇంకేమైనా ఉందా వెంటనే అక్కడి నుంచి పరుగులు పెడతారు. కాస్త ధైర్యవంతులైతే అది తమకు ఏమైనా హానీ కలిగిస్తుందోనని.. దానిపై దాడి చేసి చంపేయడం చేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం మానవతా కోణంలో ఆలోచించి.. ఆపదలో చిక్కుకున్న పామును రక్షించాడు. ఆది గాయపడగా.. దాన్ని తీసుకెళ్లి శస్త్రచికిత్స కూడా చేశాడు. పాము కాస్త కోలుకున్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టారు. ఈ విచిత్ర ఘటన అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా వి.మాడుగులలోని ఓ ఆలయంలో స్థానికులకు పాము కనిపించింది. అది ఆలయ షట్టర్ తెలుపులో ఇరుక్కుపోయి ఉంది. ఆ షట్టర్ లోంచి బయటపడేందుకు ఆ పాము తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ బయటకు రాలేకపోయింది. శరీరం గాయమై కాసేపటికి నిరసించిపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ రంగంలోకి దిగి.. ఆ పామును ఎంతో చాకచక్యంగా సెటర్‌లోంచి బయటకు తీశాడు. ఆ పామును జెర్రిగొడ్డుగా గుర్తించారు.

అయితే షెటర్‌లో ఇరుక్కున్న క్రమంలో ఆ పాము గాయపడినట్టు వెంకటేస్ గమనించాడు. వెంటనే దాన్ని దగ్గర్లోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడపామును పరిశీలించిన వెటర్నెట్ డాక్టర్ శివ రెండు గంటల పాటు శ్రమించి దానికి శస్త్ర చికిత్స చేసారు. పాము కాస్త కోలుకున్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో ఆ స్నేక్ క్యాచర్ తో పాటు వెటర్నరీ డాక్టర్ను అందరూ అభినందించారు.

వీడియో చూడండి..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights