కోళ్ళ పెంపకం కాదు…ఈయన వృత్తి పాములపెంపకం…!!!

0

మామూలుగా ఎవరికైనా పామును చూస్తే ఏం చేస్తారు..!! వెంటనే భయపడి దూరంగా వెళ్ళిపోతారు. కొందరు మాత్రం పాముని చూసినా పెద్దగా భయపడరు .కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అలాంటి వాడే.ఆ వ్యక్తికి పాములంటే భయం ఉండదు .ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా పాములు పట్టుకునే వాడు కాబట్టి. పామును చూస్తే భయపడక పోవటమే కాదు.అక్కడ ఇంకొక విచిత్రం కూడా ఉంది.

🔴పాముల పెంపకం :ఎవ‌రి ఇంట్లోనైనా కోళ్ళను పెంచుతారు లేదా మేకలను పెంచుతారు కానీ ఈయన మాత్రం విచిత్రంగా పాములను పెంచుతున్నాడు. . ఆ వ్య‌క్తి ఇంట్లో కోడి గుడ్ల‌ను పొదిగిన‌ట్లు పాముల గుడ్లు పొదిగాయి.అయిదు కాదు ప‌దీ కాదు! ఏకంగా 16 గుడ్లు. వాటిని ప‌గుల‌గొట్టుకుని జ‌ర‌జ‌రా పాక్కుంటూ పాము పిల్ల‌లు బ‌య‌టికొచ్చేశాయి. వాటిని చూసి మురిసిపోయాడు ఆ ఇంటి య‌జ‌మాని. వాటితో కాస్సేపు ఆడుకున్నాడు.

👉చోద్యం ఇలా మొదలయ్యింది : మూడునెల‌ల కింద‌ట హేస‌ర‌ఘ‌ట్ట‌లోని ఓ ఇంట్లో పాము గుడ్ల‌ను సేక‌రించాడు. వాటిని భ‌ద్రంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి, అంతే జాగ్ర‌త్త‌గా వాటిని కాపాడుకున్నాడు.

సాధార‌ణంగా మార్చిలో పాములు గుడ్లు పెడుతుంటాయ‌ని లోకేష్ చెబుతున్నాడు. హేస‌ర‌ఘ‌ట్ట‌లోని త‌న స్నేహితుడు నారాయ‌ణ ఇంట్లో ఓ నాగుపాము గుడ్లు పెట్టింద‌ని, ఈ విష‌యాన్ని అత‌ను త‌న‌కు తెలియ‌జేయ‌గా.. వాటిని త‌న వెంట తెచ్చుకున్నాన‌ని చెబుతున్నాడు స్నేక్ లోకేష్‌. ఈ మూడు నెల‌ల పాటు వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకున్నాన‌ని, ఇప్పుడ‌వి ప‌గిలి పాము పిల్ల‌లు బ‌య‌టికొచ్చాయ‌ని చెబుతున్నాడు. వాటిని పెంచుకుంటాన‌ని లోకేష్ క‌రాఖండిగా చెబుతుండ‌టం ట్విస్ట్‌
🔴స్నేక్ లోకేష్ :
ఆ ఇంటి య‌జమాని పేరు లోకేష్‌. అంద‌రూ ఆయ‌న‌ను స్నేక్ లోకేష్‌గా పిలుస్తారు. ఆయ‌న‌ వృత్తి వ్యాపారం. ప్ర‌వృత్తి పాములు ప‌ట్ట‌డం. ఎవ‌రి ఇంట్లోనైనా పాములు క‌నిపిస్తే లోకేష్‌కు ఫోన్ చేస్తారు. ఆయ‌న వెళ్లి, వాటిని ప‌ట్టుకుని సుర‌క్షిత ప్రాంతాల్లో వ‌దిలేస్తుంటారు. . ఈ పాము పిల్ల‌లు జర‌జ‌రా పాక్కుంటూ తిరుగుతున్న దృశ్యాల‌ను ఆయ‌న వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.


👉ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు నగ‌ర శివార్ల‌లోని నెల‌మంగ‌ళ‌లో చోటు చేసుకుంది.

Leave a Reply