రాష్ట్రం నుంచి కేంద్రానికి ..ఆ ఇద్దరు మహిళలు..

0

కన్నడ ఓటర్లు ఈ సారీ ఇద్దరికి పట్టాభిషేకం చేసారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు నారీమణులు 17వ లోక్‌సభలోకి ప్రవేశించారు. 28 నియోజకవర్గాలు కల్గిన రాష్ట్రం నుంచి ప్రతిసారి మహిళాధ్వని లోక్‌సభలో ప్రతిధ్వనించింది.గతం లో కూడా ఇక్కడి నుండి ఒక ఇద్దరు మహిళలు ఎన్నుకోబడ్డారు. 👩‍🦱ఇందిరాగాంధీ : దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానిగా పేరొందిన ఇందిరాగాంధీ చిక్కమగళూరునుంచి ప్రాతినిథ్యం వహించారు.

👩🏼సోనియాగాంధీ: కాంగ్రెస్‌ పార్టీని దాదాపు రెండు న్నర దశాబ్దాలకుపైగా సారథ్యం వహిస్తున్న సోనియాగాంధీ సైతం బళ్ళారి నుంచి ఎన్నికయ్యారు. 👉2013 ఎన్నికల్లో మండ్య లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికైన సినీనటి రమ్య కాంగ్రె్‌సపార్టీ సోషల్‌మీడియా విభాగంలో ముఖ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రతి లోక్‌సభలోనూ రాష్ట్రం నుంచి ప్రవేశించిన మహిళలు శక్తివంతులనే పేర్కొనవచ్చు. ప్రస్తుత 17వ లోక్‌సభలో ఇరువురు మహిళలు ప్రవేశించారు.

👉శోభాకరంద్లాజే :

శోభాకరంద్లాజే అంటూనే… కర్ణాటకలో ఓ మహిళా పవర్‌ అనే పదం వినిపిస్తుంది. తీర ప్రాంతానికి చెందిన పుత్తూరు ప్రాంతంలో జన్మించిన శోభాకరంద్లాజే బాల్యంనుంచే ఆర్‌ఎ్‌సఎ్‌సలో పనిచేశారు. సంఘ్‌పరివార్‌లో ఫుల్‌టైమ్‌ వర్కర్‌గా కొనసాగిన శోభాకరంద్లాజే 2004లో బీజేపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బెంగళూరు యశ్వంతపుర స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా యడ్యూరప్ప ప్రభుత్వంలో కొనసాగారు. రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరడంతో మంత్రి పదవికి రాజీనామా చే సిన తర్వాత 2010లో జగదీశ్‌శెట్టర్‌ ప్రభుత్వంలో విద్యుత్‌శాఖ, పౌర ఆహార సరఫరాలశాఖ మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో కర్ణాటకకే కాకుండా ఢిల్లీలోనూ డైనమిక్‌ లీడర్‌ అనే పేరుపొందారు. పలు పార్లమెంటరీ కమిటీలలో సభ్యురాలిగాను, పలు దేశాలలో జరిగిన ఎన్నికల పరిశీలకులు గా భారత్‌ తరపున శోభాకరంద్లాజే పాల్గొన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉడిపి-చిక్కమగళూరు నుంచి రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శిగాను, అధికార ప్రతినిధిగా ఆమె ఇటు పార్టీ, అటు పాలనా వ్యవహారాలలో రాణిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో ఆమె మంత్రి అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.

👉సుమలత :

దశాబ్దన్నర వయస్సులోనే సినీ రంగంలోకి ప్రవేశించి తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం, హిందీ భాషలలో 220కుపైగా సినిమాలలో నటించి వివిధ భాషలు, జాతీయ స్థాయిలో ఉ త్తమనటిగా పేరొందిన సుమలత అం బరీశ్‌ కొన్ని రోజులక్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి ఆ వెంటనే ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగి 17వ లోక్‌సభలోకి ప్రవేశించారు. 1979లో ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో జరిగిన అందాల పోటీలలో విజేతగా నిలిచిన సుమలత ప్రతి అడుగు ఓ మలుపు అనిపిస్తుంది. బాల్యంలోనే నటిగా జీవితాన్ని ప్రారంభించిన సుమలత తెలుగులో సూపర్‌హిట్‌ సినిమాలలో హీరోయిన్‌గా కొనసాగారు. కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీలోనూ ఆమె నటనలో రాణించారు. రెబల్‌స్టార్‌‌గా రాణిస్తున్న అంబరీశ్‌తో కలసి పలు సినిమాలలో నటించిన సుమలత ఇరువురి మధ్య ప్రేమ చిగురించి 1991లో అంబరీశ్‌ను వివాహమాడారు. ఆ తర్వాత సినిమాలకు కొంత దూరమయ్యారు. అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రలలో మాత్రమే సుమలత కనిపించేవారు. భార్యాభర్తలు ఇద్దరూ సినిమారంగానికే చెందినవారు. అయితే అంబరీశ్‌ రాజకీయాలవైపు ఆసక్తి చూపారు. జన్మస్థలం మండ్య జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి శాసనసభ, లోక్‌సభలలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రిగా రాణించారు. గత ఏడాది అంబరీశ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనను అభిమానించే లక్షలాదిమంది మండ్య ప్రజలు గ్రామాలవారీగా నిర్వహించిన సంతాప సభలలో పాల్గొన్న సుమలతకు రాజకీయాలలోకి రావాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

రాజకీయాలలోకి వచ్చి తమ కష్టాలు తీర్చేలా ఉంటే మండ్యకు రావాలని లేదంటే జిల్లావైపు తొంగిచూడరాదని అల్టిమేటం జారీ చేయడంతో ఆమె ప్రజాపోరాటానికే సిద్ధమయ్యారు. ఇటీవలి ఎన్నికలకు ముందు మండ్య మినహా ఎక్కడ నుంచి పోటీ చేసినా సహకరిస్తామని, కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సూచించినా రాష్ట్రంలో నే రుగా మంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేసినా మండ్యలో మాత్రమే పోటీ చేస్తానని పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇలా లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై పోటీ చేశారు. సీఎం సహా ము గ్గురు మంత్రులు, ఐదుమంది ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వెనుకడుగు వేయకుం డా ఎవరినీ విమర్శించకుండా ముందుకెళ్ళారు. ఆమె గెలుపు ఏకంగా రాష్ట్ర రాజకీయాల మార్పుకు పునాది వేసినట్లయ్యింది. సొంత కొడుకును గెలిపించుకోలేని ముఖ్యమంత్రిగా కుమారస్వామి చెడ్డపేరు తెచ్చుకున్నారు.

సుమలత ఏకైకవారసుడు అభిషేక్‌ అంబరీశ్‌ ఇప్పుడిప్పుడే సినిమాలలోకి అడుగు పెట్టారు. ఇలా సుమలత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినా జాతీయస్థాయిలో ఆమె పోటీ పెనుసంచలనమైంది. బీజేపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె బీజేపీవైపు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అన్నీ అనుకూలిస్తే కేంద్రంలో మంత్రి పదవి అవకాశం దక్కనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే దేశ వ్యాప్తంగా రాష్ట్రం పేరు మార్మోగే అవకాశం ఉందని అందరీ ఆశాభావం.

Leave a Reply