సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. స్పెషల్ రైళ్ల వివరాలు..

0

ఏటా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తుంటాయి. వాహనం కలిగి ఉన్నవారు ఏ ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంటారు. కానీ, హైదరాబాద్‌లో నివసించే పేద, మధ్యతరగతి వారు ప్రజా రవాణా ద్వారా ఊరికి వెళ్లాలంటే సముద్రం దాటినంతగా ప్రయాస పడాల్సి వస్తుంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండడం వల్ల పిల్లలతో ఇల్లు చేరాలంటే అదో ప్రయాసే. వీరికి కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు ఆర్టీసీ, ఇటు రైల్వే సాధ్యమైనంత వరకూ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులు నడుపుతుంటాయి. ఈ సారి సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు..

సికింద్రాబాద్ నుంచి..
* సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ (82725) సువిధ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి జనవరి 10 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది.
* సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (07256) రైలు సికింద్రాబాద్‌ నుంచి జనవరి 12, 13 తేదీల్లో రాత్రి 7.25 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.
* సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (82731) జనవరి 11 రాత్రి 7.25 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

నర్సాపూర్ నుంచి…
* నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07255) నర్సాపూర్‌ నుంచి జనవరి 18 శనివారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌‌కు చేరుతుంది.
* నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (82727) నర్సాపూర్‌ నుంచి జనవరి 19 ఆదివారం రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

తిరుపతి-నర్సాపూర్(07432)
* తిరుపతిలో సాయంత్రం 6.50కి బయల్దేరి మర్నాడు ఉదయం 5.40కి నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఆది, మంగళ, గురు వారాల్లో మాత్రమే ఉంటుంది. అయితే, జనవరి నెల మొదలు మార్చి నెలాఖరు వరకూ ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

నర్సాపూర్తిరుపతి (07431)
* సోమ, బుధ, శుక్రవారాల్లో నర్సాపూర్-తిరుపతి ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్‌లో రాత్రి 10 గంటలకు ప్రారంభమై తిరుపతికి మర్నాడు ఉదయం 8.45కు చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు కూడా జనవరి నుంచి ఏప్రిల్ 1తేదీ వరకూ అందుబాటులో ఉండనున్నాయి.

ఇతర స్టేషన్ల మధ్య నడపనున్న ప్రత్యేక రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.. ఆ వివరాలివీ..

Leave a Reply