విజయం

” విజయం ” అనే పదం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది.విజయం సాదించకపోతే బాధను మిగులుస్తుంది.దీని వల్ల మనిషి మరింత కృంగి పోతాడు.మొదలు పెట్టిన ప్రతి ఒక్క పనిలో అందరూ విజయం సాధించలేరు.కొంతమంది మాత్రమే విజయాన్ని సాధించగలరు.ఏ పని చేయాలన్నా చాలా మంది భయపడుతుంటారు.అలాంటి వాళ్ళు ఏది కూడా చేయలేరు.అలాంటి వాళ్ళని ” భయం ” ముందుకు వెళ్ళనివ్వదు.భయాన్ని పోగొట్టుకోవాలంటే మన దగ్గర ఒక్కటే మార్గం ఉంది. ధైర్యంతో సాహసం చేయండి !! మీ భయాన్ని తరిమి కొట్టండి.మీరు అలా చేసిన తరువాత మిమ్మల్ని చూసి ఆ భయమే పారిపోతుంది.

  • ఇతరులకు గౌరవం ఇవ్వు.ఎప్పుడు ?వాళ్లు కూడా నీకు గౌరవం ఇచ్చినప్పుడు.నిన్ను నువ్వు ఎక్కడ తగ్గించుకోకు ఒక్కసారి తగ్గించుకోవడం మొదలు పెడితే జీవితాంతం తగ్గుతూనే ఉండాలి !! పైన చెప్పిన విధంగా చేస్తే పొగరు అని అనుకుంటారు.
    కానీ విజయం సాధించాలంటే ఎక్కడ తగ్గకూడదు.
    ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు అలాగే ఊహించలేరు కూడా.ఎందుకంటే ఇది ” సృష్టి రహస్యం ” కాబట్టి.వచ్చేవి రాక మానవు. వచ్చాక చెప్పి వెళ్ళవు. రావాలిసిన సమయంలో వస్తాయి.పోవాలిసిన సమయంలో పోతాయి. అతి ఆలోచన మనిషిని క్రుంగ తీస్తుంది.
    ఆలోచన మరవండి, శాంతగా ఉండండి. విజయం
    ఈ రోజు ఒకరికి రావచ్చు.ఇంకొకరికి ఇంకో రోజు రావచ్చు. కానీ కష్ట పడే ప్రతి ఒక్కరికి ఎదో ఒక రోజు విజయం తప్పకుండా వస్తుంది.

Leave a Reply