Summer Health Tips: వేసవిలో నెల రోజుల పాటు రోజూ సూర్య నమస్కారం చేయండి.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వావ్ అంటారు..

surya-namaskar-1

ప్రస్తుతం ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా జీవన శైలి సాగుతుంది. దీంతో ఆరోగ్యం కోసం యోగా, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం వివిధ ఆసనాలు వేయడానికి బదులుగా.. కొంతకాలం క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరం శక్తితో నిండి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే సూర్య నమస్కారంలో మొత్తం 12 ఆసనాలు కలిసి చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బిజీ జీవితంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడి, అలసట, శరీర నొప్పి, శరీరంలో శక్తి లేకపోవడం అనేవి ప్రజలకు సాధారణ విషయాలుగా మారాయి. ఆరోగ్యం బాగుంటే అంతా బాగానే ఉంటుంది. రకరకాల విషయాల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఏదైనా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు.. ఆరోగ్యం గుర్తుకొస్తుంది. కనుక ఆరోగ్యం కోసం మీరు మీ బిజీ జీవితంలో అరగంట సమయం కేటాయించాలి. ఈ వేసవిలో ఒక నెల రోజుల పాటు సూర్య నమస్కారం చేయడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి తెలిస్తే.. ఈ రోజే సూర్య నమస్కారం మొదలు పెడతారు.

వేసవి కాలంలో మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శక్తి కొరత ఏర్పడుతుంది. కనుక ఈ కాలంలో మన శరీరానికి ఎక్కువ జాగ్రత్త అవసరం. వేడి వాతావరణం కారణంగా ముఖంపై మొటిమలు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి. వీటన్నింటి మధ్య మీరు యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే.. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం వల్ల కలిగే లెక్కలేనన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలు

భారతదేశంలో సూర్యుడికి ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. సూర్యుడిని బలం, తెలివితేటలు, శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ కారణంగానే కొంతమంది ఉదయాన్నే నిద్రలేచి సూర్య నమస్కారం చేస్తారు. సూర్య నమస్కారం అన్ని ఆసనాలలోకి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. సూర్య నమస్కారాన్ని 12 యోగాసనాల సంగమంగా పరిగణిస్తారు. ఈ ఆసనం మీ శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సూర్యోదయానికి ముందే లేచి క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయండి. వేసవిలో ఒక నెల పాటు ఈ ఆసనం వేయడం ద్వారా, మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ శరీరంలో శక్తి లేకపోవడం అనిపించదు, కండరాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దాని ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.

సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణవ్యవస్థ బలోపేతం: వేసవి కాలంలో ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తే.. కడుపు సంబంధిత వ్యాధులు రావు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖం మెరుస్తుంది: వేసవిలో ఎండ, దుమ్ము, ధూళి కారణంగా ముఖం కూడా నిస్తేజంగా మారితే.. ముఖం నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తే, మొటిమలు వచ్చి ముఖం కాంతిని కోల్పోతే.. అప్పుడు సూర్య నమస్కారాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. దీనివల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

శరీరంలో శక్తి వస్తుంది: వేసవి కాలంలో తరచుగా అలసట, తక్కువ రక్తపోటు మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక సూర్య నమస్కారం దిన చర్యలో భాగంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో శక్తి కొరత ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది.

బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది: సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు.. శరీరంలోని అంతర్గత అవయవాలు సాగుతాయి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలు బలపడతాయి. పొట్టపై ఉన్న అదనపు కొవ్వు కూడా తగ్గుతుంది.

పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం: మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొంతమంది మహిళలు భరించలేని తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. కనుక మహిళలు కూడా సూర్య నమస్కారాలను క్రమం తప్పకుండా చేయాలి. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఋతుస్రావ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మానసిక ఆరోగ్యం: మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు ఏ సమస్య నుండైనా బయటపడవచ్చు. అందువల్ల మానసిక ఆరోగ్యం బాగుండటం చాలా ముఖ్యం. మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలను సాధన చేయాలి. ఇది మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights