గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు..
భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే అతిశయోక్తి కాదు. అంహిసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు గాంధీ. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి పది ఆసక్తికర విశేషాలు మీకోసం.. గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం…