భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు,ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు?
భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 August 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు 1. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. 2. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే…