మీరు ఇలా చేస్తున్నారా..అయితే మీ కిడ్నీ జాగ్రత్త…

నిత్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని డాక్టర్స్ వాపోతున్నారు.
🔴కిడ్నీలు : మనిషి శరీరంలో అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. 👉రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం.
కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు.. మన ఆహారపు అలవాట్లు, జీవన వ్యవహారాల వల్లే అవి చెడిపోవడానికి దారితీస్తాయి. మరి కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
🔹నీరు సరిగా త్రాగక్ పోవడం : శరీరానికి నీరు చాలా అవసరం. నీరు సరిగా తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో అంతర్గతంగా ఉండే మలినాలను వడపోయటానికి సరిపడా నీరు లేక కిడ్నీలు త్వరగా చెడిపోతాయి. కనుక శరీరానికి తగినన్ని ద్రవాలు తీసుకోవాలి.
🔅అధిక ఒత్తిడి : అధిక ఒత్తిడి కి గురవడం కూడా కిడ్నీలు పాడవడానికి ఒక కారణం. కనుక వీలైనంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉండి కిడ్నీలు బాగా పనిచేసేలా చూసుకోండి.
🔅మూత్రాన్ని ఆపుకోవటం: కొంతమంది ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు మూత్రాన్ని చాలా సేపటి వరకు ఆపుకుంటారు. గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే ఆపుకునేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల కిడ్నిలో రాళ్లు ఏర్పడే పరిస్థితితో పాటు కిడ్నీ పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.
🔅బరువు తగ్గేందుకు: కొంతమంది త్వరగా బరువు తగ్గేందుకు ప్రోటీన్ షేక్‌లను అతిగా తీసుకుంటున్నారు. దీనివల్ల శరీరానికైతే ప్రోటీన్లు అందుతున్నాయి. కానీ, మనకు తెలియకుండానే అవి కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి బరువు తగ్గడంలో తొందరపాటు తగదు.కాబట్టి పైన చెప్పిన విషయాలలో జాగ్రత్త వహిస్తే మీ కిడ్నీ సేఫ్ గా ఉంటుంది.
