తమిళ బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!

Teluguwonders:
ఇండియాలో బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా ఉంది. మొదట్లో బాలీవుడ్ లో మాత్రమే ఈ షో నిర్వహించగా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రన్ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో ఉన్నాయి. అయితే ఈ హౌస్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతూంటాయి. ఇప్పుడు అలాంటి గొడవ ఒకటి తమిళ బిగ్ బాస్ హౌస్ లో జరిగి సంచలనంగా మారింది.
కమల్ హాసన్ హోస్ట్ గా వరసుగా మూడోసారి జరుగుతున్న బిగ్ బాస్ షో లో ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో నటించిన తమిళ హాస్య నటి మధుమిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షోలో 50 రోజుల నుంచి ఉన్న మధుమిత కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఏం జరిగిందో ఏమో.. గత శనివారం అకస్మాత్తుగా ఈ నటి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఖంగుతిన్న నిర్వాహకులు ఆమెను షో నుంచి బయటకు పంపించేశారు. దీంతో తమిళ బిగ్ బాస్ షో పై విమర్శలు వెల్లువెత్తాయి. కమల్ హోస్ట్ గా జరుగుతున్న ఈ షోలో గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఆత్మహత్యా ప్రయత్నమే జరగడంతో మరింత వివాదమైంది. ఈ షోను రద్దు చేయాలని మూడో సీజన్ ప్రారంభానికి ముందే కొంతమంది మద్రాస్ హైకోర్టులో పిల్ కూడా వేశారు.
హౌస్ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని మధుమిత అంటోంది. షోలో ఒక్కోసారి జరిగే గొడవలు చూస్తే తర్వాత ఏం జరుగుతుందో అనే అనుమానం రాకమానదు. 100 రోజులు ఈ హౌస్ లోనే ఉండాలి కాబట్టి సభ్యులు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
