Telangana News: గుడ్‌న్యూస్.. ఇకపై మరింత ఈజీగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ.. క్షణాల్లో పొందొచ్చు.. ఎలానో తెలుసా?

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ’ కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవాల సెంటర్ల నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు.
దీంతో ఈ జాప్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో మీ సేవ విభాగం, సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్‌లతో సమావేశాలు నిర్వహించి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. గత 15 రోజుల నుంచి ఈ విధానం మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ తాజా మార్పుల తర్వాత ఇప్పటికే 17,571 మంది వరకు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
