మొహర్రం పండుగ విశేషత అదే

The Moharram festival

Teluguwonders:

⭐మొహర్రం:

ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండగల్లో మొహర్రం ఒకటి. పది రోజుల పాటు జరిపే ఈ పండగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్దఎత్తున హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా పంజా (ప్రతిమ) లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇస్లాంను వ్యాపింపజేసేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ఇమాం హుస్సేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశంతో దీన్ని పాటిస్తారు. 💥మొహర్రం పండగ కాదు ; మొహర్రం అనేది వాస్తవానికి పండగ కాదు. ఇస్లాం క్యాలడర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. అయితే ఈ నెలలోని పదో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.
💥మహ్మద్ ప్రవక్త ;
మహ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను, ఆక్రమాలను నిరసించారు. పాలితులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, జనమంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మహ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ , హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ సైతం ఆయన బాటలోనే నడిచి సుపరిపాలన అందించారు. ప్రవక్త ఆశయాలను ఆయన వారసులు కొనసాగించారు. అయితే, వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. అనంతరం యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని రాక్షస పాలన సాగించాడు. చెడు అలవాట్లకు బానిసైన యజీద్ ప్రజల్ని పీక్కుతినడం ప్రారంభించాడు. దీంతో అతడి దురాగతాల్ని హజ్రత్ హుస్సేన్ ఎదురించి ప్రజల పక్షాన నిలిచాడు. శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనల్ని యజీద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు.
🔴మహ్మద్ ప్రవక్త వారసుడు శాపం..
మొహర్రం నెల ఒకటో రోజున ఇరాక్‌లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్‌తోపాటు కుటుంబసభ్యులను చిత్ర హింసలకు గురిచేసి, మహిళలు, పసిపిల్లలను సైతం పాశవికంగా హతమార్చింది. మొహర్రం నెల 10వ రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్‌ను శత్రుసైన్యం చుట్టుముట్టింది. ప్రార్థనలో భాగంగా సజ్దా చేస్తున్న సమయంలో భూమిపై తల ఆన్చడంతో వెంటనే శత్రు సైన్యం హుస్సేన్ శిరస్సును ఖండించింది. హుస్సేన్ తలతో సైన్యం ఊరేగుతూ విజయోత్సవం జరుపుకుంటుంది.
శత్రువుల చేతిలో 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. ఈ సందర్భంలో హజ్రత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని అల్లాహ్‌ను ప్రార్ధిస్తూ ప్రాణాలు విడుస్తాడు. 🔴యాజిద్ తెగ పశ్చాత్తాపం; యుద్ధానంతరం యాజిద్ తెగకు చెందిన వారు పశ్చాతాపం చెంది ..దేవుడా మేం తప్పు చేశాం.. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమర్చాం.. కాబట్టి మమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు..అప్పటి నుంచి ప్రారంభమైన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
మరోవైపు మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన సందర్భంగా వారికి సంతాపంగా అరబ్‌వాసులు రెండు రోజుల పాటు ఉపవాస దీక్ష పాటిస్తారు. మొహర్రం నెలలోని 10, 11 రోజుల్లో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights