ఇది చంద్రయాన్ 2 పంపిన చంద్రుడి స్పష్టమైన ఫోటో..

This is a clear photo of the moon sent by Chandrayaan 2.

Teluguwonders:

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. ‘చంద్రయాన్-2’ చంద్రుడి ఫోటో విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడది భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి 2,650 అడుగుల ఎత్తు నుంచి ఫొటో తీసి ఇస్రోకి పంపింది. ‘చంద్రయాన్-2’లో ఉన్న ల్యాండర్ (విక్రమ్) ఆగస్టు 21న ఈ ఫొటో తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఫొటోలో చంద్రుడిపై ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, మేర్‌ ఓరియంటేల్‌ బిలాన్ని స్పష్టంగా చూడవచ్చు.

చంద్రయాన్-2 ప్రస్తుతం చంద్రుడి క్షక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో 118 X 4412 కిమీలు పరిభ్రమిస్తోంది. అంటే చంద్రుడికి అత్యంత సమీపంగా 118 కిమీల దూరం వరకు చేరుతూ, తిరిగి 4412 కిమీల దూరానికి వెళ్లిపోతూ తిరుగుతోంది. చివరికి ఇది సెప్టెంబర్‌ 7 మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2.. చంద్రుడిని సమీపిస్తూ ఒక ఫోటో తీసింది.

🔵చంద్రుడి నిఎంతో స్పష్టంగా :ఇందులో చంద్రుడి ఉపరితలంపై ఉండే బిలాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

💥కక్ష్య కుదింపు :

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన మొదటి రోజు అనంతరం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్న వ్యోమనౌక దూరాన్ని మరింత తగ్గించారు. సెప్టెంబర్‌ 7న చంద్రునిపైకి దించేందుకు చేస్తున్న సన్నాహాల్లో భాగంగా బుధవారం మధ్యహ్నం 12.50 గంటల సమయంలో 20 నిమిషాల పాటు మోటార్లను మండించి దూరాన్ని 4,412 కి.మీ మేర తగ్గించినట్లు ఇస్రో ప్రకటించింది.

మరో చివరలో చంద్రుని ఉపరితలానికి 118 కి.మీ దూరంలో అంతరిక్ష నౌక ఉంది. నాలుగో విన్యాసం పూర్తయ్యేసరికి కక్ష్య ఆకారం గుండ్రంగా మారుతుందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 20న ఉపగ్రహాన్ని చంద్రుడి 114కి.మీ x 18,072 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యోమ నౌకకు సంబంధించిన అన్ని పరిమాణాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. చంద్రుని కక్ష్యలో తదుపరి విన్యాసం ఆగస్టు 28న ఉదయం గం. 5:30 నుంచి గం. 6:30 మధ్యలో ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights