Tollywood: రామ్ చరణ్‌తో బ్లాక్ బస్టర్ మిస్సైన హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్.. క్రేజ్ పీక్స్..

సోషల్ మీడియాలో ప్రతిరోజు సెలబ్రెటీలకు సంబంధించిన ఏదోక విషయం తెగ వైరలవుతుంటాయి. కొన్ని రోజులుగా చిన్నప్పటి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. మరికొందరు తారల త్రోబ్యాక్ ముచ్చట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ లేటేస్ట్ క్రేజీ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఆ మూవీని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? చూడచక్కని రూపం, ఉంగరాల జుట్టుతో యూత్ కు ఇష్టమైన హీరోయిన్ ఆమె. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్. 2016లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత నితిన్, సమంత నటించిన అఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే శర్వానంద్ జోడిగా శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్యూ, హలో గురు ప్రేమకోసమే వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. నిఖిల్ సరసన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది. అదే సమయంలో బటర్ ఫ్లై, 18 పేజీస్ వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో ముందుగా కథానాయికగా ఎంపికైందట. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. చివరకు ఆమె స్థానంలోకి సమంత వచ్చింది.
ఇటీవలే కిష్కంధపురి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పరదా చిత్రంలోనూ నటించింది. ఇవే కాకుండా ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే జానకి వర్సెస్ కేరళ చిత్రంతో నటిగా ప్రశంసలు అందుకుంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
