Tollywood: ఒకప్పుడు సూపర్ స్టార్.. సినిమా అవకాశాల్లేక నిరుద్యోగిగా.. రీఎంట్రీలో విలన్గా బ్లాక్ బస్టర్ హిట్స్..

సినీరంగంలో అతడు ఒకప్పుడు సూపర్ స్టార్. కానీ అతడి జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. హీరోగా నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్క సినిమాతో అతడి జీవితం మలుపు తిప్పింది.
సినిమా ప్రపంచంలో అతడు ఒక సూపర్ స్టార్. హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడు నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సంవత్సరాలపాటు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూ నిరుద్యోగిగా ఇంట్లోనే ఉండిపోయాడు. కేవలం తన భార్య సంపాదన మీద ఆధారపడి ఉండిపోయాడు. కానీ విలన్ గా అతడు నటించిన ఒక్క సినిమా.. తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇప్పుడు విలన్ గా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. కొన్నేళ్లుగా సినీరంగంలో సైలెంట్ అయిన అతడు.. ఇప్పుడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి. బాలీవుడ్ నటుడు.. యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్.
90లలో అందమైన హంక్‌గా ఒకప్పుడు పేరు సంపాదించుకున్న బాబీ.. ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న బాబీ తన జీవితంలోని కష్టకాలాన్ని గుర్తుచేసుకున్నాడు. 2000 నుంచి 2010 మధ్య అతడికి సినిమాలు తగ్గిపోయాయి. దీంతో ఎలాంటి పని లేకుండా చాలా సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పని కోసం దర్శకులు, నిర్మాతల కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ… తన పేరు చెబుతూ.. దయచేసి అవకాశం ఇవ్వండి అని చెప్పేవాడినని అన్నారు. కొన్ని సమయాల్లో తన జీవితాన్ని ముగించాలనుకున్నానని అన్నారు. ఎలాంటి అవకాశాలు లేకుండా.. జీవితంలో మానసిక సంఘర్షణతో యుద్ధం చేస్తున్న సమయంలో తన భార్య అండగా ఉందని అన్నారు. 1995లో ‘బర్సాత్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడి క్రేజ్ తగ్గిపోయింది.
చాలా కాలం సినిమాకు దూరంగా ఉండిపోయిన బాబీకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఛాన్స్ ఇచ్చారు. రణబీర్ కపూర్, సందీప్ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమాతో బాబీ డియోల్ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టారు. ఈ మూవీతో అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాతో అటు నార్త్, ఇటు సౌత్ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత బాబీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
