వరుస ACCIDENTSకి గురవుతున్న టాలీవుడ్ హీరోస్

Untitled design (41)

ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఈ ఇండ‌స్ట్రీకి ఏదో అయిపోయింది. మ‌ళ్లీ మ‌ళ్లీ హీరోలు గాయ‌ప‌డుతున్నారు. ఇప్పుడు కూడా మ‌ళ్లీ మ‌రో హీరో కూడా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడు. మొన్న వ‌రుణ్ తేజ్, నిన్న నాగ‌శౌర్య త‌ర్వాత ఇప్పుడు సందీప్ కిష‌న్ కూడా గాయ‌ప‌డ్డాడు.
సినీ హీరోలకు యాక్సిడెంట్స్ అనేవి ఎప్పటినుండో ఉన్నా సరిగ్గా పదేళ్ల క్రితం నుంచి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి .

🚨సరిగ్గా పదేళ్ల క్రితం : jr ఎన్టీఆర్ కి ఘోరమైన accident : అప్పట్లో తెలుగుదేశం ఎలక్షన్స్ క్యాంపెయినర్గా మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు పాపం నల్లగొండ సమీపంలో జూన్ 27 2009 శుక్రవారం రోజు పెద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. దానిలో అదృష్టవశాత్తు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర గాయాలతో బ్రతికి బయట పడ్డారు .దానితో అప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లు జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం కూడా తెలిసిందే .ఈ ఆర్ ఆర్ఆర్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందే రామ్ చరణ్ కాలికి కూడా గాయం అయింది కాకపోతే ఇవి ఒకరకంగా చెప్పుకోవాలంటే మైనర్ యాక్సిడెంట్స్ అనుకోవాలి.

🚨బాంబ్ బ్లాస్ట్‌లో గాయ‌ప‌డిన సందీప్ కిష‌న్..:
క‌ర్నూల్ ఆస్ప‌త్రిలో చికిత్స‌..షూటింగ్ చేస్తుండ‌గా ఈయన యాక్సిడెంట్ పాల‌య్యాడు.

🔴వివరాల్లోకి వెళ్తే : తాజాగా క‌ర్నూల్ శివార్ల‌లో ఈయ‌న సినిమా తెనాలి రామకృష్ణ షూటింగ్ జ‌రుపుకుంటుంది. డైరెక్ట‌ర్ జి.నాగేశ్వర రెడ్డి తెర‌కెక్కిస్తున్నఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సీన్ ఒకటి చేసారు.

🔴పైట్ మాస్టర్ చేసిన తప్పు వల్ల : పైట్ మాస్టర్ చేసిన తప్పు వల్ల ఈ బాంబ్ బ్లాస్ట్‌లో హీరో సందీప్ కిషన్‌కు గాయాల‌య్యాయి. వెంట‌నే ఆయ‌న్ని ద‌గ్గ‌ర్లోనే ఉన్న కర్నూలు హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. సందీప్ కిష‌న్‌ను ప‌రిశీలించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి కావాల‌ని చెప్పారు. దాంతో ప్ర‌స్తుతానికి తెనాలి రామ‌కృష్ణ షూటింగ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స ప్లాపుల‌తో కొట్టుమిట్టాడుతున్న సందీప్ కెరీర్ మొత్తం ఇప్పుడు తెనాలి రామ‌కృష్ణ సినిమాపైనే ఆధార‌ప‌డి ఉంది పాపం.మొన్న

🚨నాగ‌శౌర్య‌కు కూడా :
మొన్న నాగ‌శౌర్య‌కు కూడా షూటింగ్‌లో accident.. అయింది.కాలికి భారీ గాయాలు..అయ్యాయి

🚨వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం :

ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఇలాంటి యాక్సిడెంట్ లో చనిపోయిన హీరోలు కూడా ఉన్నారు 🔴యశోసాగర్; “ఉల్లాసంగా ఉత్సాహంగా” అనే సినిమాలో హీరోగా నటించిన యశోసాగర్ 2012డిసెంబర్ 25 న ముంబై నుండి హైదరాబాద్ వెళ్తుండగా కార్ accidentచనిపోయారు.

🔵నందమూరి.హరికృష్ణ : నందమూరి హరికృష్ణ గారు రు 29 ఆగస్టు 2018న ఒక అభిమాని పెళ్లికి వెళ్లి వస్తుండగా కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారు అది కూడా సరిగ్గా 2009లో జూనియర్ ఎన్టీఆర్ accident అయిన నల్గొండ సమీపం లోనే ..అవ్వడం..ఆశ్చర్యం..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights