Tollywood: నెలకు 30 లక్షల జీతం.. ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు ఇలా..

నటనపై ఆసక్తి, సినిమాల్లో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో ఎంతో మంది సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. వివిధ రంగాల్లో మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటున్న పలువురు సినిమాపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో సైతం ఈ జాబితాలోకి చెందినవారే.
లక్షలాది మంది సినిమా ప్రపంచంలోకి రావాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చే సాహసం చేస్తుంటారు. నటనపై ఆసక్తితో అప్పటికే చేస్తున్న ఉద్యోగం వదిలేసిన తారలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. కానీ మీకు తెలుసా.. ? ఒక యువకుడు నెలకు రూ.30 లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అతడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు.. ఓటీటీని శాసిస్తున్నాడు. ప్రస్తుతం ఒక పెద్ద వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అతడి పేరు లక్ష్య లాల్వానీ. ఈ పేరు సౌత్ సినీప్రియులకు అంతగా పరిచయం లేదు. కానీ ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో అతడి పేరు మారుమోగుతుంది.
లక్ష్య లాల్వానీ.. కిల్, ఇప్పుడు సక్సెస్ అయిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో లక్ష్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లక్ష్య లాల్వాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటనా రంగంలోకి రాకముందు తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నానని వెల్లడించారు. అతను రోజుకు కనీసం రూ. 15,000 సంపాదించేవాడినని.. కొన్నిసార్లు రూ. 25,000 వచ్చేవని అన్నారు. గతంలో నెలకు రూ.30 లక్షల వరకు వచ్చేవని అన్నారు. కానీ సినిమాపై ఇష్టంతో రిస్క్ అయినప్పటికీ ఉద్యోగాన్ని వదిలేసినట్లు తెలిపారు.
లక్ష్య తన నటనా జీవితాన్ని టెలివిజన్‌లో ప్రారంభించాడు. ‘అధురీ కహానీ హమారీ’, ‘ప్యార్ తునే క్యా కియా’ వంటి సీరియల్స్ చేశాడు. ఆ తర్వాత యాక్షన్ డ్రామా కిల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ద్వారా మరోసారి పాపులర్ అయ్యాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
