టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే నేడు

Tollywood superstar Mahesh Babu's birthday today

Teluguwonders:

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్‌‌మహేశ్‌బాబుకు సోషల్ మీడియాలో విషెస్ జోరు గా సాగుతున్నాయి
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నేడు 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇటీవలే మహర్షిగా ప్రేక్షకులను పలకరించిన ఆయన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రానున్నారు.

Ⓜమహేశ్‌బాబు :
సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 44 ఏళ్లు నిండుతున్నాయి. 2005 ఫిబ్రవరి 10న బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌ను ముంబయిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు సంతానం.

సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్‌బాబు అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీసు గలగలలాడాల్సిందే. వినూత్నమైన కథలతో ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ప్రిన్స్ అని పిలిపించుకుంటున్న టాలీవుడ్ రాకుమారుడు మహేష్‌బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) నేడు.
సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక కథలతోనే అటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే బాక్సాఫీసును షేక్ చేయడం మహేష్ నైజం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటూ వివాదాలకు దూరంగా ఉండే మహేష్‌బాబు అంటే అందరికీ ఎంతో అభిమానం.

🔴నాలుగేళ్ళ ప్రాయంలోనే :

బాలనటుడిగా ‘నీడ’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్‌బాబు 1983లో వచ్చిన ‘పోరాటం’ సినిమాలో తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించారు.

👉తర్వాత బాలనటుడిగా శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాల్లో నటించి మెప్పించారు.

🌸రాజకుమారుడు’ సినిమాతో హీరోగా :

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

👉ఇటీవల తన 25వ చిత్రం ‘మహర్షి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్ మంచి హిట్ కొట్టారు. రైతుల సమస్యల ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించింది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights