Trump: నా గుడ్ ఫ్రెండ్ మోదీకి ఫోన్ చేస్తా.. డీల్ సెట్ చేస్తా.. ట్రంప్ కీలక కామెంట్స్

అమెరికా – భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మోదీ చైనా పర్యటనతో ట్రంప్ వైఖరీలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ తనకు గుడ్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ – అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి చర్చలు జరుపుతున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడటానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ చర్చలు విజయవంతంగా ముగియడం ఇరు దేశాలకు పెద్ద కష్టమేమీ కాదు’’ అని ట్రంప్ అన్నారు.
మోదీ – ట్రంప్ మధ్య కొత్త సమీకరణాలు
గతంలో ట్రంప్.. భారత్ – అమెరికా మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. “దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులం. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాం” అని ట్రంప్ అన్నారు. అయితే అదే సమయంలో ప్రధాని మోదీ చేస్తున్న కొన్ని పనులపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “మోదీ చేస్తున్న కొన్ని పనులు నాకు నచ్చడం లేదు, కానీ ఆయన ఒక గొప్ప ప్రధాని” అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ భావాలను తాను అభినందిస్తున్నానని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ పరిణామాలు భారత్-అమెరికా సంబంధాల్లో ఒక కొత్త మలుపును సూచిస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
