రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్

*రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్* హైదరాబాద్: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు. హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి ఇస్తాం కాని సీటీ బస్సులు తిరగవు. హైదరాబాద్ నగరం తప్ప అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, అన్ని రకాల విద్యాసంస్థలకు అనుమతి లేదు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
