మాస్ సినిమాల్లో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చెప్పారు అంటున్న వరుణ్ తేజ్

Untitled design (3)

Teluguwonders:

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్‌ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

‘వాల్మీకి’ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, 20వ తేదీన అందరూ థియేటర్‌లో సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని వరుణ్ కోరారు. అలాగే, తన పెదనాన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ని ‘వాల్మీకి’ కంటే రెండింతలు పెద్ద హిట్ చేయాలని అభిమానులను, ప్రేక్షకులను వరుణ్ కోరారు.

‘‘ఇది నా తొమ్మిదో సినిమా. ఇప్పటి వరకు ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీలంటూ ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. కానీ, ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే.. ఆ కిక్కే వేరబ్బా. మామూలుగా లేదమ్మ’’.. ఈ మాటలన్నది ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పటి వరకు వరుణ్ తేజ్‌ను మనం లవర్ బోయ్‌గా చూశాం.. సోల్జర్‌గా చూశాం.. సైంటిస్ట్‌గా చూశాం. కానీ, ఫస్ట్ టైమ్ ఊర మాస్‌లో చూడబోతున్నాం. ఈ విషయం ‘వాల్మీకి’ టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైంది.

💥 మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరబ్బా.. -వరుణ్ తేజ్ :

ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 👉ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ముందుగా వెంకటేష్‌కు థ్యాంక్స్ చెప్పారు. తాను ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పారని అన్నారు. మాస్ సినిమాలో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి తనకు చెప్పారని, దాన్ని ఇప్పుడు కొంచెం రుచి చూశానని అన్నారు వరుణ్.

బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పనిచేయడం తన అదృష్టమని వరుణ్ అన్నారు. ఈ సినిమాలో తాను బాగా చేశానని అందరూ అంటున్నారని.. కానీ, హరీష్ శంకర్ వల్లే తాను ఈ క్యారెక్టర్‌ను ఇలా చేయగలిగానని వరుణ్ చెప్పారు. ‘‘చరణ్ అన్న, చిరంజీవి గారిని నిన్నే కలిశాను. ‘సైరా’ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ, వాళ్ల ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. సినిమా ట్రైలర్ చూసి బాబాయ్ నాతో, హరీష్ గారితో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ యాస బాగా మాట్లాడావ్ అని అన్నారు’’ అని వరుణ్ చెప్పుకొచ్చారు.తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గ్యాంగ్స్టర్‌గా వరుణ్ లుక్ చూసి అంతా వహ్వా అన్నారు. గద్దలకొండ గణేష్‌గా ఆయన్ని తెరపై ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
👉మొత్తానికి మాస్ మంత్రం వరుణ్ తేజ్‌కి వంటబట్టేసింది!


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights