చెన్నై,ముంబై ఇండియన్ IPL మ్యాచ్ పై విక్టరీ వెంకటేష్ జోస్యం

క్రికెట్ అంటే సాధారణ అభిమానులకే కాదు సినీ తారలకు కూడా ఎంతో ఇంట్రెస్ట్. వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు క్రికెట్ స్టేడియం వైపు వెళ్తూ ఉంటారు . సాధారణ ప్రేక్షకుల్లాగే వారు కూడా సంతోష పడతూ ఉంటారు.ఒక్కోసారి సినీ తారలు అంతా కలిసి మ్యాచ్స్ కూడా ఆడుతుంటారు. ఇదంతా ఎందుకు , ఏ హీరో గురించి చెబుతున్నారని అనేదే కదా మీ ప్రశ్న .ఆయన మరెవరో కాదు,విక్టరీ వెంకటేష్ ఈ పేరు పరిచయం చేయనక్కర లేని పేరు. ఆయనకు సినిమాలు అంటే ఎంత ప్రేమో. క్రికెట్ అంటే అంతే మక్కువ. తరుచుగా క్రికెట్ స్టేడియాల్లో సందడి చేసే ఏకైక నటడు వెంకటేషే. ఐపీఎల్‌ను మొదటి నుంచి వెంకటేష్ క్షుణంగా పరిశీలిస్తున్నారు. చెన్నై, ముంబై ఇండియన్‌కు ఎవరికి ఎక్కువ విజయావకాశాలున్నాన్న దానిపై 👉ఆయన స్పందన : ‘‘చెన్నై, ముంబై జట్లు ఫైనల్‌కు రావడం అందరూ ఊహించిందే. నిజానికి ఐపీఎల్‌లో అవి రెండూ బలమైన జట్లు. అయితే టీ-20 లాంటి ఆటల్లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం. ఈ రెండు జట్లూ అనేక సార్లు ఫైనల్‌కు వచ్చాయి. అయితే చెన్నైకి ధోని నాయకత్వం అనేది కొంత ఉపకరిస్తుందని అనుకుంటున్నాను. పైగా ఆ జట్టులో అందరూ దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. అలా అని ముంబైని తక్కువగా అంచనా వేయలేం. మెల్లిగా వారి ఆటను ప్రారంభించి ఫైనల్ వరకు వచ్చారు. వారికి కూడా విజయావకాశాలు ఎక్కువే ఉన్నాయి’’ అని విక్టరీ వెంకటేష్ జోస్యం చెప్పారు . విశేషం ఏంటంటే విక్టరీ వెంకటేష్ మంచి క్రికెట్ ప్లేయర్ కూడా..
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
