పవన్ కు తెలియదేమో..ఎవరైనా చెప్పండయ్యా అంటున్న విజయ సాయి రెడ్డి

Vijay Sai Reddy

Teluguwonders:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

👉 ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి:

వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి, విరుస్తున్నాయి.

💥జన సేనాని నివేదిక :

వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలనలో పారదర్శకత లోపించిందని జనసేనాని ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పాలన జనవిరుద్ధంగా ఉందంటూ పవన్ విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పాలనపై నివేదిక ఇచ్చారు. అంతకు ముందే ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నవులూరులో ఉన్న ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డ్‌‌ను పరిశీలించారు. టన్ను రూ. 375 అని చెప్పి రూ.900 చొప్పున అమ్ముతున్నారని విమర్శించారు.

💥రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి :

జగన్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా అంటూ.. పవన్‌పై సెటైర్లు వేశారు.

💥ఇసుకను ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని చెప్పండి :

ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా.ఇసుకను కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా తెలియపర్చండి. 👉మంగళగిరి సమీపంలో పవన్ కళ్యాణ్ కట్టుకున్న ఇంటికి టీడీపీ నేతలే ఇసుక సరఫరా చేశారనే అర్థం వచ్చేలా విజయసాయి ట్వీట్ చేశారు.ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది.

ఇసుకను కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా చెప్పండంటూ జనసేనానికి చురకలు అంటించారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుందని ఎద్దేవా చేశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights