Viral: పురావస్తు తవ్వకాల్లో కనిపించిన 350 ఏళ్ల నాటి పుర్రె.. ఏంటా అని పరిశీలించగా

skelton

కొందరు శాస్త్రవేత్తలు పురావస్తు తవ్వకాలు జరిపారు. వారికి ఆ తవ్వకాల్లో ఓ పుర్రె లభించింది. దానిపై పలు పరిశోధనలు జరపగా.. 350 ఏళ్ల నాటి పుర్రె లభించింది. ఇంతకీ ఆ పుర్రె విషయంలో పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

పురావస్తు తవ్వకాలు చేపట్టిన కొందరు శాస్తవేత్తలకు అసాధారణమైన రీతిలో 350 ఏళ్ల నాటి కాలానికి చెందిన పుర్రె ఒకటి లభించింది. 1800-1900 వందల సంవత్సరాల మధ్యలో ఈ ఓ శతాబ్ద కాలం పాటు మ్యూజియం సేకరణలో భాగంగా ఉందట. ఆ సమయంలో మానవ అవశేషాలను యూరోపియన్ మ్యూజియంలకు పంపడం సర్వసాధారణమట.

క్లాడిన్ అబెగ్ నేతృత్వంలోని జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పురావస్తు తవ్వకాలు చేపట్టగా.. వారికి దొరికిన ఈ 350 సంవత్సరాల నాటి పుర్రెపై పలు పరిశోధనలు జరిపారు. 1914లో స్విస్ కలెక్టర్ ఒకరు లౌసాన్‌లోని మ్యూజియంకు ఈ పుర్రెను విరాళంగా ఇచ్చారని.. ఆయనే మళ్లీ ఇప్పుడు బొలీవియాలో తిరిగి తీసుకున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. 13వ శతాబ్దం ప్రారంభంలో ఉండే ఇంకా(Inka) తెగకు చెందిన మనిషి పుర్రెగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పుర్రెపై పలు గుర్తులు, గాట్లు ఉన్నాయని.. ఆ ఆకారాల బట్టి చూస్తే ఆ వ్యక్తి చిన్నతనంలో ఒక రకమైన ‘కపాల వైకల్యం’కు గురయ్యాడని తెలుస్తోందన్నారు. ప్రీ- కొలంబియన్ దక్షిణ అమెరికాలో ఇది సర్వసాధారణం.

పరిశోధనల ప్రకారం.. పుర్రెకు ట్రెపనేషన్ అనే ప్రక్రియ జరిగిందని.. పుర్రె ముక్కను డ్రిల్లింగ్ చేయడం లేదా స్క్రాప్ చేయడం ద్వారా పుర్రెలో రంధ్రం ఏర్పడేలా చేశారన్నారు. సాధారణంగా తలనొప్పి తగ్గించడానికి లేదా మూర్ఛ వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి ఇలా చేస్తారట. ఎందుకంటే.. ఆ కాలంలో ఇది దుష్టశక్తులు దరి చేరకుండా చేస్తుందని నమ్మేవారు. ట్రెపనేషన్ అనేది అప్పటి ఆచారంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా, ప్రస్తుతం ఈ పుర్రె స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ కాంటోనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ హిస్టరీలో ఉందని.. ప్రజలు సందర్శనార్ధం పొందుపరిచారన్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights