మీకెందుకురా నాయన ఈ స్టంట్స్.. ఇందులో తప్పు ఎవరిదో చెప్పగలరా..?

Viral Video: అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బైక్ రైడర్లు ఇద్దరూ వెంటనే లేచి ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. ఒక విధంగా చూస్తుంటే వెనుక నుంచి వెళ్లే వాళ్లు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది..
ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు:
ఆ వీడియోలో ఇద్దరు బైకర్లు రోడ్డుపై వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు ముందుకు వెళ్తుండగా, మరొకరు కొంచెం వెనుక ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అధిక వేగంతో ముందుకు వెళ్తున్న బైకర్ వెనుకకు వస్తాడు. అకస్మాత్తుగా అతని బైక్ స్కిడ్ అయిపోయింది. దీని కారణంగా ముందు వెళ్తున్న బైకర్ బైక్ కూడా కాస్తా పడిపోయింది.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బైక్ రైడర్లు ఇద్దరూ వెంటనే లేచి ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. ఒక విధంగా చూస్తుంటే వెనుక నుంచి వెళ్లే వాళ్లు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పైగా వెనుకనున్న బైకర్ ముందున్న బైకర్‌తో గొడవకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ఇందులో ఎవరిది తప్పు ఉందో మీరే గమనించండి. వీడియోను వెనుక నుంచి వస్తున్న రాపిడో బైకర్ రికార్డు చేశారు. పైగా వెనుకాల వస్తున్న రైడర్ హెల్మెట్‌కు కెమెరా ఉండటంతో దానిని చూసిన వారు గొడవకు దిగారు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ హంగామా సృష్టించారు.
ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు దానిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రోడ్డుపై అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ఎల్లప్పుడూ ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చాలా మంది వినియోగదారులు అంటున్నారు. అదే సమయంలో బైకర్లు ఇద్దరూ హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద నష్టం తప్పింది.
ఈ సంఘటన రోడ్డుపై అప్రమత్తంగా ఉండటం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది. కొంచెం అజాగ్రత్త ఒకరి ప్రాణానికే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. అలాగే హెల్మెట్ ధరించడం, వాహనాల మధ్య డిస్టెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి అని గుర్తించుకోవాలని వాహనదారులు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
