పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం.. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ను గుర్తుకు తెస్తున్న వీడియో..

viral-video-9

ఒక్క మొక్కలు తప్ప.. ఒక జీవి మరొక జీవికి ఆహారం.. ఒక జీవిని చూసి మరొక జీవి భయపడుతుంది.. అదే సృష్టి ధర్మం.. ఎలుక పిల్లికి ఆహారం. పిల్లులు ఎలుకలను వేటాడి.. మరీ వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ రెండిటి మధ్య వైరం సహజంగా వచ్చిందే.. ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఎంతగా ప్రేక్షుల ఆదరణ సొంతం చేసుకుందో చెప్పనవసరం లేదు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా చూసే టామ్ అండ్ జెర్రీ వంటి సన్నివేశం నిజంగా జరిగే.. అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందులో ఎలుకని పట్టుకోవడానికి పిల్లి ప్రయత్నం.. పిల్లి నుంచి తప్పించుకునేందుకు ఎలుక ఆరాటం కనిపిస్తున్నాయి.

టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా చూస్తారు.. అవును పిల్లి, ఎలుక మధ్య వైరం.. ఇద్దరు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం చూడడానికి చాలా సరదాగా అనిపిస్తుంది. పిల్లి, ఎలుకల పరిహాసాన్ని చూడటం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇదే సన్నివేశం ఇంట్లో కనిపిస్తే.. మనం ఇంట్లో లేదా బయట పిల్లి… ఎలుక ఒకదానికొకటి వెంబడించడం చూస్తే.. మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టామ్ అండ్ జెర్రీ షోనే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే మీకు ఖచ్చితంగా కార్టూన్ గుర్తుకు వస్తుంది. ఈ వీడియో ప్రజలను నవ్వించడమే కాదు.. చాలా వినోదాన్ని అందించింది. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

రియల్ లైఫ్ లో టామ్ అండ్ జెర్రీ

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఎలుక ఒక గదిలో పరిగెడుతూంది.. దానిని పిల్లి వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. ఎలుక పిల్లికి దొరకూడదు అనే సంకల్పంతో తెగ స్పీడ్ తో పరిగెడుతోంది. పిల్లికి ఆహరం కాకూడదు అని చేసే ప్రయత్నంలో పిల్లి నుంచి తప్పించుకుని విజయం సాదించింది. కొన్నిసార్లు ఎలుక మెట్లు ఎక్కింది. కొన్నిసార్లు బకెట్ వెనుక దాక్కుంది.. అకస్మాత్తుగా బయటపడి మళ్ళీ పరిగెత్తుతుంది. అదే సమయంలో, పిల్లి ఎలాగైనా ఎలుకని పట్టుకోవాలి.. తినాలనే కోరికతో ఎలుకని నిరంతరం వెంబడిస్తూనే ఉంది. ప్రతి అవకాశంలోనూ దానిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ వేట కొంత సమయం కొనసాగుతుంది, చివరికి, పిల్లి మెట్లపై ఎలుకను పట్టుకుంది. అయితే ఈ ఎలుక, పిల్లి పోరాటంలో మరొక పిల్లి ఎంట్రీ ఇచ్చింది.. వాటిని చూస్తూ ఉంది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

 

ఎలుక , పిల్లికి సంబంధించిన ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్విన్సెంట్‌గావో అనే ఖాతా షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 42 మిలియన్ల మందికి పైగా వీక్షించారు . 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు వివిధ ఫన్నీ వ్యాఖ్యలను చేస్తూ తమ భావాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అని కామెంట్ చేస్తే.. మరొకరు ఇది నిజ జీవిత టామ్ అండ్ జెర్రీ.. నేపథ్య సంగీతం కూడా అలాగే ఉంది అని అన్నారు. మరొకరు, “బాల్య జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి. నేను ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తాను. అని కామెంట్ చేయగా.. మరొక వ్యక్తి సరదాగా “మరొక పిల్లి ఉపవాసం ఉందా?” అని వ్రాశాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights