వీసా – పేటిఎం డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది..

0

పేటిఎం.. పరిచయం అక్కర్లేని ఆన్ లైన్ పేమెంట్ సైట్. డిజిటలైజేషన్ తర్వాత ఈ మధ్య ప్రతీ ఫోన్‌లో ఈ యాప్ కామన్ అయిపోయింది. మొబైల్ రీఛార్జ్‌ల కోసం మొదలై ఇండియాలో పూర్తిస్థాయిలో పాతుకుపోయి పేమెంట్స్ బ్యాంక్ స్థాయికి ఎదిగింది పేటిఎం. ఇప్పుడు తాజాగా వీసాతో కలిసి డెబిట్ కార్డులను త్వరలో తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన వీసా.. పేటిఎంకు సహకారం అందించాలని అనుకోవడం ఆర్థిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చల తుది దశకు వచ్చినట్టు వీసా సీఈఓ ఆల్ఫ్రెడ్ కెల్లీ వెల్లడించారు.

యూఎస్‌కు చెందిన అతిపెద్ద సంస్థ అయిన వీసా… ఇండియాపై పట్టు పెంచుకోవడానికి పేటిఎంతో చేతులు కలుపుతోంది. పేటిఎంతో జట్టుకట్టి వాళ్లకు సేవలను అందించడం వల్ల తమ మార్కెట్‌ కూడా పెరుగుతుందని వీసా యాజమాన్యం చెబ్తోంది. దీని వల్ల పేటిఎం నెట్వర్క్ కూడా మరింతగా పెరగబోతోంది. ఇప్పటివరకూ పేటిఎం తన కస్టమర్లకు పేటిఎం బ్యాంక్ ఖాతాలు అందిస్తోంది. అడిగిన వాళ్లకు రిక్వెస్ట్ మేర అదనపు నగదుతో రూపే డెబిట్ కార్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పేటిఎం దగ్గర 4.4 కోట్ల వర్చువల్ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. వీసాతో డీల్ నేపధ్యంలో ఇండియాలో paytm తో కలిసి వీసా మరింత పాపులర్ అవ్వడం ఖాయం.

Leave a Reply