*విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌

IMG-20200914-WA0004.jpg

*విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌* _విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జాతీయస్థాయిలో 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది. విజ్ఞాన భారతి, విజ్ఞాన్‌ ప్రసార్‌, NCERT సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి._ *పరీక్ష విధానం* _పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి_ *6 నుంచి 8వ తరగతి విద్యార్థులు* _జూనియర్‌ విభాగం, 9 నుంచి 11 వ తరగతి విద్యార్థులు సీనియర్‌ విభాగం_ _ఒకే పరీక్ష 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. సమయం 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్‌ మార్కులు లేవు. మాధ్యమం ప్రాంతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌_ _ఓపెన్‌ బుక్‌ సిస్టం. ఎవరింట్లో వారు పరీక్ష రాసుకునే సువర్ణావకాశం_ _డిజిటల్‌ విధానంలో మాత్రమే. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ (డిజిటల్‌ డివైజెస్‌)_ *సిలబస్‌* ◆ *సెక్షన్‌-A (40 మార్కులు)* _విజ్ఞానశాస్త్ర అభివృద్ధిలో భారతీయుల పాత్ర 20 శాతం 20 ప్రశ్నలు మార్కులు 20_ వెంకటేష్‌ బాపూజీ కేత్కర్‌ జీవిత చరిత్ర, కాలగమన మీద చేసిన కృషి- 20 ప్రశ్నలు, 20 మార్కులు (vvm స్టడీ మెటీరియల్‌ www.vvm.org.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు). ఈ సెక్షన్‌ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడానికి కనీసం 20 మార్కులు సాధించాలి. ◆ *సెక్షన్‌-B (60 మార్కులు)* సైన్స్‌, మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌ తార్కిక చింతన 10 ప్రశ్నలు, 10 మార్కులు. ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురి విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ అందిస్తారు. (పాఠశాల నుంచి కనీసం 10 మంది విద్యార్థులు ఒక తరగతి నుంచి పాల్గొంటే తరగతి వారీగా మెరిట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు) *జిల్లా స్థాయి* జిల్లాలో ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురి విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ అందజేస్తారు. *రాష్ట్ర స్థాయి పరీక్ష* పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఆ తరగతిలో ప్రతిభ ఆధారంగా 20 మంది విద్యార్థులను ప్రతి తరగతి నుంచి 20 మంది విద్యార్థుల చొప్పున రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో నుంచి ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి రాష్ట్రస్థాయి విజేతలుగా మొత్తం 18 మందిని ప్రకటిస్తారు. రాష్ట్రస్థాయి క్యాంపునకు హాజరైన వారికి ధ్రువపత్రం, మెమంటో నగదు బహుమతి అందజేస్తారు. మొదటి బహుమతి రూ.5000, రెండో బహుమతి రూ.3000, మూడో బహుమతి రూ.2000. *జాతీయ స్థాయి పరీక్ష* ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థులను ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసి జాతీయ స్థాయి క్యాంపునకు ఎంపిక చేస్తారు. ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి జాతీయ స్థాయి విద్యార్థులుగా మొత్తం 18 మందిని ఎంపిక చేసి వారిని హిమాలయన్స్‌గా ప్రకటిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైనవారికి ధ్రువపత్రం, మెమంటో నగదు బహుమతి ఇస్తారు. మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000, మూడో బహుమతి రూ.10,000 చొప్పున అందజేస్తారు. అదే విధంగా జాతీయ స్థాయి విజేతలకు అదనంగా దేశంలోని నాలుగు జోన్ల నుంచి ప్రతి తరగతి నుంచి ముగ్గురు విజేతలకు మొత్తం 18 మంది విద్యార్థులకు పారితోషికాలు ఇస్తారు. జోనల్‌ స్థాయిలో మొదటి విజేత రూ.5వేలు, రెండో విజేత రూ.3వేలు, మూడో విజేత రూ.2వేలు. జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ధ్రువపత్రం, మెమంటో అందజేస్తారు. *రిజిస్ట్రేషన్‌* ఆన్‌లైన్‌లో www.vvm.org.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పాఠశాల స్థాయిలో ఒక ఉపాధ్యాయుని వీవీఎమ్‌ కోఆర్డినేటర్‌గా నియమించి పాఠశాల వివరాలు పిల్లల వివరాలు నమోదు చేయాలి. _రిజిస్టర్‌ చేసుకున్న పిల్లకు తమ మొబైల్‌ నంబర్‌కు ఈ-మెయిల్‌కు యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ వస్తుంది._ VVM-2020 రిజిస్టర్‌ చేసుకున్నవారు నవంబర్‌ మొదటి వారంలో VVM యాప్‌ (గూగుల్‌ ప్లే స్టోర్‌) డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. ఫైనల్‌ పరీక్షకు ముందు పిల్లలు మాక్‌టెస్ట్‌లను ఈ యాప్‌ ద్వారా సాధన చేసుకోవచ్చు. *పరీక్ష ఫీజు:* రూ.100 (ఆన్‌లైన్‌ మాత్రమే చెల్లించాలి) *రిజిస్ట్రేషన్‌ ముగింపుతేదీ:* సెప్టెంబర్‌ 30. రూ.20 ఫైన్‌తో అక్టోబర్‌ 15 *పరీక్ష తేదీ:* నవంబర్‌ 29, 30 (ఏదైనా ఒకరోజు) *పరీక్ష సమయం* : 10.00 A.M- 8.00 P.M *పరీక్ష ఫలితాలు* : డిసెంబర్‌ 15 *రాష్ట్రస్థాయి క్యాంపు:* 2021, జనవరి 10, 17, 24 (ఏదైనా ఒకరోజు) *రెండురోజుల జాతీయ క్యాంపు:* 2021, మే 15, 16 *వెబ్‌సైట్‌* : www.vvm.org.in వీవీఎమ్‌ కో ఆర్డినేటర్‌ను కింది మొబైల్‌ నంబర్లలో సంప్రదించవచ్చు 9948099462, 9948867665, 9866275101 7207276553


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights