సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??

0

అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి.
🔵నిద్ర ఒక గొప్ప వరం : నిద్ర అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం. ప్రశాంతమైన నిద్ర చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపోతే…. మరుసటి రోజంతా మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. 👉నిద్ర సరిగా పట్టకపోతే.. ఆ రోజుంతా చాలా చిరాకుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక జీవితం గడపటానికి నిద్ర తప్పనిసరి. అందుకే తగినంత సమయం నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు.
🔵8 గంటల నిద్ర must:
ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 8 గంటలసేపు నిద్ర అవసరం. అలాకాకుంటే కనీసం 6 గంటలైనా నిద్ర తప్పనిసరి. అంతకంటే తగ్గితే అది నిద్రలేమికి దారితీస్తుంది. నిద్రలేమి లేదా ఇన్ సోమ్నియా అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.

సాధారణంగా మనం పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి 10-15 నిమిషాల సమయం పడుతుంది. అలా కాకుండా మనం 5 నిమిషాల్లోపే నిద్రలోకి జారుకుంటున్నామంటే.. మనకు సరిగా నిద్ర సరిపోవడం లేదని అర్థం. కాబట్టి రోజూ మనం సరిగా నిద్ర పోతున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఇంట్లో, ఆఫీసులో ఎన్నిపనులు, ఒత్తిళ్లు ఉన్నా.. వేళకు నిద్రపోవాలి. లేకపోతే… నిద్రలేమితో అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఆధునిక జీవన అలవాట్లు, ఉద్యోగం, ఒత్తిడి వంటి వాటి కారణంగా నిద్రలేమి సమస్య క్రమంగా తీవ్రమవుతోంది. అలాగే పలు రకాల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యల వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. తగినంత నిద్ర పోవడం ద్వారా వీటిని అధిగమించి ఉల్లాసంగా ఉండవచ్చు.

Leave a Reply