‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ తాగి పడిపోయాడో.. నాకు తెలీదు..అంటున్న నేత..

Where Pawan Kalyan got drunk .. I don't know

Teluguwonders:

మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడం జగన్‌కు సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్పందించారు. మద్యనిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశాకే ఓట్లడుగుతామని ఆయన తెలిపారు.

🔴 చంద్రబాబు పైనా గుస్సా :

చంద్రబాబు నాయుఢు పైన కూడా ఆయన వ్యాఖ్య లు చేసారు.. గతం లో,..పాలిచ్చే ఆవును వదులుకుని.. దున్నపోతును తెచ్చుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం ఘాటుగా బదులిచ్చారు.

👉నారాయణ స్వామి మాట్లాడుతూ:

చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది పాలు కాదు విషమన్నారు. 50 శాతం ఓట్లు తమ పార్టీకి పడ్డాయంటే చంద్రబాబు ఇచ్చిన పాలు ఎంత వరకు పనిచేశాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన ఇలాగే మాట్లాడితే జనాలకు ఇంకా దూరం అవుతారన్నారు.

🍻నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం :

తాము అధికారంలోకి వస్తే ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన ధీమాగా చెప్పారు. నవరత్నాల్లో ఒకటిగా మద్యపాన నిషేధం అంశాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చాక.. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెల్ట్ షాపులను మూసేయించిన సర్కారు.. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలను చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని మద్యం దుకాణాల సంఖ్య 20 శాతం తగ్గుతుంది.

💥ఏడాదికి 25 శాతం చొప్పున :

చిత్తూరు జిల్లా ఆముదాలలో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలిపారు. ఏడాదికి 25 శాతం చొప్పున వచ్చే నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో మద్యపానాన్ని నిషేధిస్తామన్నారు. 3 స్టార్, ఫైవ్ స్టార్ బార్లనే మద్యం అమ్మకాలను కొనసాగిస్తామన్నారు. అయితే మద్యపాన నిషేధం అమలు సాధ్యాసాధ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

🔴మద్య నిషేధం అమలుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు :

పూర్తి స్థాయిలో చేయడం జగన్‌కు సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల దుష్ఫలితాలు తలెత్తుతాయన్నారు. ఎలా బతకాలి, ఏం తాగాలి, ఏం తినాలనే విషయాల్లో ప్రజలను నియంత్రించడం మొదలుపెడితే అందరూ ఎదురు తిరుగుతారన్నారు. ప్రజామోదం లేకుండా ప్రభుత్వం ఓ విధానాన్ని తీసుకొస్తే అమలు సాధ్యం కాదని జనసేనాని తెలిపారు. మద్యపానం కొందరి సంస్కృతి అన్నారు.
.
కాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

🔴పవన్ పై తీవ్ర వ్యాఖ్య లు :

‘‘పవన్ ఎక్కడ తాగి పడిపోయాడో.. ఎక్కడ తిరిగాడో నాకు తెలీదు. కానీ ఆయనకు మద్యం రుచి తెలుసు. అందుకే మద్యపాన నిషేధమంటే భయపడుతున్నాడు. ఆయన లాంటి వాళ్లు ఫైవ్ స్టార్‌ బార్లకు వెళ్లి తాగొచ్చు. మద్య నిషేధానికి మద్దతు ఇవ్వకపోతే.. జనసేనకు మహిళలెవరూ ఓట్లేయరు’’ అని నారాయణ స్వామి తెలిపారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights