ఆళ్వారులు..ఎవరు..ఎంత మంది..??

0

🔯ఆళ్వారులు :ఆళ్వారులు అంటే సత్యం లోతులను, ఆనందం లోతులను చూసిన వారు అని అర్ధం.. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందినవారు. 👉విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఆచార్యత్రయం శ్రీనాధముని, యామునాచార్యులు,
రామాను-జార్యులు ఆళ్వారులవల్ల ప్రభావితులైనవారే.(ఆచార్యత్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు).
🔯ఆళ్వారుల కాలం: ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి
ఆధారాలు లేవు కానీ, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందేవారేగాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారాఅనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

🔯ఆళ్వారుల రచనలు :
ఆళ్వారులు సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు.
తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు.పాశురాల సంకలనాన్ని “ద్రావిడ వేదం “అన్నారు.

🔴ఆళ్వారులు ఎంత మంది:
ఆళ్వారులు పది మంది అని ఒక వాదం, పన్నెండు మంది అని మరొకవాదం ఉన్నది. పన్నెండు మంది అనే వాదనే లోకంలో స్థిరపడింది. పన్ని ద్దరాళ్ వారులు” అనే పదబంథం వాడుకలోఉంది. “ఆధారాలు దొరికినంత వరకు పదుగురి పేర్లివి.

🔯1. భూత ఆళ్వారు (కౌమోదకీ అని విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించారని ప్రసిద్ధి)

🔯2.పోయగై ఆళ్వారు: (పాంచజన్య అనే శంఖం అంశ అంటారు)

🔯 3. పేయాళ్వార్ (మహాదాహ్వయలళ్వార్ అని వాడుక నందకం అనే ఖడ్గం అంశ),

🔯4. తిరుమళిశై ఆళ్వారు (భక్తిసార ఆళ్వారు. సుదర్శనచక్రం అంశ )

🔯5. కులశేఖర్రాళ్వారు (కౌస్తుభమణి అంశ)

🔯6. తొండరడిప్పడి ఆళ్వారు (ఈయనే విప్రనారాయణుడిగా ప్రసిద్ధి. తులసి దళాలు, పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం)

🔯 7. తిరుప్పాణి ఆళ్వారు (యోగి వాహన ఆళ్వారు. ఇతడుపంచముడిగా జన్మించాడని అంటారు )

🔯 8.తిరుమంగై ఆళ్వారు (పరకాల ఆళ్వారు క్షత్రియుడు గా జననం విష్ణు ఆయుధం శార్గం అంశం )

🔯9. పెరియాళ్వారు పరాంకుశ ఆళ్వారు విశ్వక్సేనుడు అంశ, గీత కార్మిక కులం లో జననం)

🔯ఆండాళ్ : ఈ తొమ్మిది మంది కాక ఆండాళ్ ని కూడా ఆళ్వారులు అని అన్నారు గోదాదేవి గా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి అంశ అంటారు .పెరియాళ్వార్ కి చెందిన తులసివనంలో ఆమె శిశువుగా దొరికినందువల్ల పెరియాళ్వారే ఆమె తండ్రి అని వ్యవహరిస్తారు.

Leave a Reply