Women: ఆడవాళ్ల చేతికి గాజులు.. అందం మాత్రమే కాదు..! అసలు రహస్యం తెలిస్తే..

women-wearing-bangles-1

చేతులకు గాజులు ధరించడం అనేది 16 అలంకారాలకు సంబంధించినది మాత్రమే కాదు, ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడితో ముడిపడి ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గాజులను రోజూ ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

భారతీయ హిందూ మహిళలందరికీ దాదాపుగా ఆభరణాలంటే అత్యంత ప్రీయం. తమను తాము అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. మంగళసూత్రంతో పాటు, కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవులకు కమ్మలకు, చేతులకు గాజులు వంటివి ధరించడం కూడా వారి ఆభరణాలలో ముఖ్యమైన భాగం. చేతులకు గాజులు ధరించడం అనేది 16 అలంకారాలకు సంబంధించినది మాత్రమే కాదు, ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడితో ముడిపడి ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గాజులను రోజూ ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

శుక్రుడు అందానికి కారకుడు. ఏ స్త్రీ జాతకంలో నైనా శుక్ర స్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం వలన ఆ దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శుక్ర స్థానం బలోపేతం చేయడానికి….విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహాయపడతాయని కూడా చెబుతున్నారు. గాజులు ధరించేవారికి చుట్టూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. వీటి శబ్దం, ఆకృతి, రంగులు పరిసరాల్లోని నెగెటివ్ ఎనర్జీని తగ్గించి, శుభ ఫలితాలను ప్రేరేపిస్తాయి. అంతేకాదు, గాజులు ధరించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుంది.

మహిళ చేతి గాజులు ఆమె భర్త ఆయురారోగ్యానికి, కుటుంబ సమృద్ధికి సూచికలుగా భావించబడతాయి. మహిళ గాజులు ధరించడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడుతుంది అని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆకుపచ్చ గాజులు దానం చేయడం వల్ల బుధ గ్రహం నుండి ఆశీస్సులు లభిస్తాయి. వివాహిత స్త్రీలకు పుణ్యం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, గాజులు ధరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది.

గాజులు రక్త ప్రసరణ మెరుగుపడేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలోనూ ఉంచుతుంది. ఇది శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరంగా ఉంచడానికి సహకరిస్తుంది. గాజులు ధరించకపోతే అది వివాహిత మహిళకు అశుభంగా పరిగణించబడుతుంది. 7వ నెల తరువాత గర్భిణీలు గాజులు ధరించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. శబ్దాలు గుర్తించే శక్తిని శిశువు అభివృద్ధి చేసుకుంటుంది. ఇది కేవలం శిశువుకే కాదు, తల్లికి కూడా మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడి తగ్గిస్తుంది.

సైన్స్ ప్రకారం, మణికట్టు క్రింద 6 అంగుళాలు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. వాటిపై ఒత్తిడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో మహిళలు తమ చేతులకు గాజులు ధరించడం ద్వారా శక్తివంతంగా ఉంటారు


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights