ఊపిరి పీల్చుకునే సమయo ఎక్కడ ఉంది??

0

ప్రపంచకప్‌ ఆరంభం నుంచే ఒత్తిడి

కుల్దీప్‌, జాదవ్‌పై ఆందోళన లేదు

ఇంగ్లండ్‌ బయలుదేరే ముందు మీడియాతో కోహ్లీ

ముంబై: మేటి జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో తలపడనుండడంతో ఈ వరల్డ్‌క్‌పలో తీవ్రమైన పోటీ నెలకొననుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి బంతి నుంచే ఆటలో మమేకం కావడం జట్టు విజయానికి ఎంతో కీలకమన్నాడు. ఈనెల 30న ఇంగ్లండ్‌లో మొదలవనున్న వరల్డ్‌క్‌పకు బయల్దేరే ముందు కోచ్‌ రవి శాస్ర్తితో కలిసి కోహ్లీ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ఇప్పడు మూడో వరల్డ్‌కప్‌లో ఆడబోతున్న కోహ్లీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

నాలుగు కఠిన మ్యాచ్‌లుండడంతో ఊపిరి తీసుకొనేంత సమయం కూడా లేదన్నాడు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (జూన్‌ 5)తో తలపడనున్న భారత్‌.. ఆ తర్వాత ఆస్ట్రేలియా (జూన్‌ 9), న్యూజిలాండ్‌ (జూన్‌ 13), పాకిస్థాన్‌ (జూన్‌ 16)తో ఆడనుంది. ‘ఫార్మాట్‌, జట్టు బలాబలాలపరంగా నేను పాల్గొన్న ప్రపంచ కప్‌ల్లో అత్యంత పోటీ నెలకొన్న టోర్నీ ఇదే. అఫ్ఘానిస్థాన్‌నే తీసుకుంటే, 2015 తర్వాత ఆ జట్టు పూర్తిగా రూపాంతరం చెందింది’ అని కోహ్లీ చెప్పాడు.

అలసత్వానికి చోటులేదు..

వరల్డ్‌క్‌పలో అలసత్వానికి ఎక్కడా చోటులేదని విరాట్‌ అన్నాడు. తొలి మ్యాచ్‌ నుంచే యుద్ధం మొదలవుతుందన్నాడు. ‘మైదానంలోకి అడుగుపెట్టిన తొలి సెకను నుంచే ఆ రకమైన ఒత్తిడి అనుభవమవుతుంది. నూరుశాతం మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండాలి. ఇదో సవాల్‌’ అని అన్నాడు. ‘ప్రీమియర్‌ లీగ్‌ లేదా లా లిగా కోసం మేటి ఫుట్‌బాల్‌ క్లబ్‌లు మూడు-నాలుగు నెలలపాటు అదే జోరును కొనసాగిస్తాయి. మరి మేమెందుకు కాదు’ అని చెప్పుకొచ్చాడు.

వరల్డ్‌కప్‌ పరిస్థితి వేరు..

ఇటీవల ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన సిరీస్‌లో 300 పరుగుల స్కోరు ఓ ప్రామాణికంగా కనిపించింది. కానీ, మెగా టోర్నీకి వచ్చేసరికి పరిస్థితి మారుతుందని విరాట్‌ అభిప్రాయపడ్డాడు. ‘పిచ్‌లు చాలా బాగా ఉండబోతున్నాయి. హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు ఎక్కువ ఉంటాయని భావిస్తున్నా. అయితే, ద్వైపాక్షిక సిరీ్‌సలను

వరల్డ్‌క్‌పతో పోల్చలేమ’ని అన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొనడడంతో 260-270 స్కోరును కూడా కాపాడుకొనే అవకాశం ఉందని చెప్పాడు. వీలైనంత ముందుగా మ్యాచ్‌లు జరిగే చోటుకు చేరుకుని అక్కడి పరిస్థితులకు అలవాటుపడడం మంచిదనే అభిప్రా యం వ్యక్తం చేశాడు. భారత బౌలింగ్‌ విభాగం సవాళ్లకు సిద్ధంగా ఉందన్నాడు. ‘జట్టులోని బౌలర్లందరూ ఐపీఎల్‌ ఆడినా 50 ఓవర్ల మ్యాచ్‌ కోసమే సన్నద్ధమయ్యారు. నాలుగు ఓవర్లు వేసినా ఎవరూ అలసిపోయినట్టుగా కనిపించలేదు. అనవసరంగా ఫిట్‌నె్‌సను కోల్పోవద్దని ఐపీఎల్‌ ఆరంభం కాకముందే స్పష్టం చేశామ’ని కోహ్లీ వివ రించాడు. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుం డా అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే మైండ్‌సెట్‌తోనే టోర్నీకి సన్నద్ధమైనట్టు చెప్పాడు.

ఆ ఇద్దరు బౌలింగ్‌ మూల స్తంభాలు

భారత బౌలింగ్‌కు స్పిన్‌ ద్వయం కుల్దీప్‌ యాద వ్‌, యజ్వేంద్ర చాహల్‌ మూల స్తంభాలని కోహ్లీ కొనియాడాడు. ఐపీఎల్‌లో కుల్దీప్‌ ప్రదర్శనపై తానేమీ పెద్దగా ఆందోళన చెందడం లేదని కోహ్లీ చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడిన కుల్దీప్‌ పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే, ఐపీఎల్‌ వైఫల్యం అతడికి కనువిప్పని కోహ్లీ చెప్పాడు. లోపాలను సవరించుకుని వరల్డ్‌క్‌పలో బలంగా బరిలోకి దిగడానికి సరైన సమయమన్నాడు. ఐపీఎల్‌లో పెద్దగా రాణించని కేదార్‌ జాదవ్‌పై కూడా ఆందోళనలేదని విరాట్‌ చెప్పాడు.

ధోనీ పాత్ర కీలకం.. కీపర్‌గా వన్డేల్లో తనకు సాటిలేదని ధోనీ ఎన్నోసార్లు నిరూపించా డు. క్యాచ్‌లు తీసుకోవడమే కాదు.. రనౌట్‌లు లేదా స్టంపింగ్‌లలో కీలకంగా వ్యవహరిస్తాడు. ఐపీఎల్‌లో ధోనీ బ్యాటింగ్‌ అద్భుతం. ఇక, గత టోర్నీతో పోల్చితే ఈసారి వరల్‌ ్డకప్‌లో పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వెస్టిండీస్‌ పేపర్‌పై ఎంతో బలంగా కనిపిస్తోంది. ఫ్లాట్‌ పిచ్‌లైనా వాతావరణానికి తగ్గట్టుగా ఆటను మలచుకునే విధంగా ఉండడం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. – రవిశాస్ర్తి

Leave a Reply