నిమిషానికి ఐదుగురు రోగుల మరణాలు

WhatsApp Image 2019-09-20 at 08.17.55

Teluguwonders:

ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న వైద్య ప్రమాణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. అసురక్షిత ఆరోగ్య సంరక్షణ వలన దాదాపు లక్షలాది మంది రోగులు నిర్లక్ష్యం భారిన పడుతున్నారు. దీని కారణంగా ప్రతి ఏడాది 26 లక్షల మంది చనిపోతున్నారు. ఈ మరణాలన్నీ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం. సగటు రోగి యొక్క వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన ప్రభావాల వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

ప్రతి నిమిషానికి కనీసం ఐదుగురు రోగులు చనిపోతున్నారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితిని చాలా మేరకు నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోగుల రక్షణపై డబ్ల్యుహెచ్‌ఒ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17న మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం( వరల్డ్‌ పేషెంట్‌ సేఫ్టీ డే)’ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రోగులకు సంఘీభావంగా ఒక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడంతో నిమిషానికి ఐదుగురు రోగులు చనిపోవడం ఆందోళకర అంశమని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అద్నామ్‌ పేర్కొన్నారు. దీని వలన ఇకపై ఎవరూ చనిపోకూడదన్నది తమ లక్ష్యమని అన్నారు. వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారాన్ని గుర్తించి, వాటిపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా దీంట్లో మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, దానికి అనుగుణంగా మెడిసన్‌ను సూచించి, వినియోగించడంలో లోపాలు ఉన్నాయి.

రోగులకు వైద్యులు సూచించే మందుల ఖర్చే ఏడాదికి 42 బిలియన్‌ డాలర్ల మేర అవుతోంది. అసురక్షిత శస్త్ర చికిత్సా విధానాలు 25 శాతం మంది రోగుల్లో పలురకాల సమస్యలను కలిగిస్తున్నాయి. దీని ఫలితంగా ఏటా శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత 10 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలో రోగులు చనిపోవడం అనేది ఆహ్వానించదగ్గ విషయం కాదు.

ఇటువంటి సమయంలో రోగుల ఆరోగ్య సంరక్షణకు సత్వర మెరుగైన చర్యలు తీసుకొని మరణాలు తగ్గించాలని డబ్ల్యుహెచ్‌ఒ ప్రపంచ దేశాలను, తన భాగస్వామ్య సంస్థలను కోరింది. సమర్ధవంతమైన వైద్యసేవలను ఇవ్వడంలో రోగుల రక్షణ, దాంట్లో నాణ్యత అనేవి ముఖ్యమైన అంశాలని పేర్కొంది. ఈ రోగుల సంరక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థికంగా కొంత పొదుపు కూడా ఉంటుంది. ఎలాగంటే సమస్య నివారణకు పెట్టే ఖర్చు చికిత్స కోసం పెడుతున్న ఖర్చు కన్నా తక్కువగా ఉంటుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights