Yellamma: మొత్తానికి ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికాడు..! తెరపైకి ఊహించని పేరు

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ వేణు. పలు సినిమాల్లోనూ వేణు నటించి మెప్పించాడు, ముఖ్యంగా మున్నా సినిమాలో టిల్లు పాత్రలో నవ్వులు పూయించాడు. వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు, నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు.. ఆతర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి నవ్వులు పూయించారు. ఆతర్వాత దర్శకుడిగా మారి బలగం అనే సినిమా చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా ముందుగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నాడు వేణు. కానీ ఆ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు.
నాని తర్వాత నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. నితిన్ కూడా ఈ సినిమా నుంచి పక్కకు వచ్చేయడంతో ఇప్పుడు ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అని అందరూ అనుకున్నారు. మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికేశాడని తెలుస్తుంది.
ఆయన ఎవరో కాదు మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్. ఇన్నాళ్లు సంగీతంతో ఆకట్టుకున్న దేవీశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎల్లమ్మ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది. మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్.. ఇప్పుడు హీరోగా ఎలా నటిస్తారో చూడాలి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
