దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది

horror

దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది

దెయ్యలు లేవు అనే వారికి 1762వ సంవత్సరంలో లండన్ మహానగరంలో జరిగిన ఓ సంఘటన కనువిప్పు కలిగించగలది.ఆ రోజు దాదాపు ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచారం ఇచ్చింది. లండన్ నగరంలోని కాక్లేన్లో ఒక ఇంట్లో దయ్యం ప్రవేశించిందని, ఆ దయ్యం మాట్లాడుతుందని, ఎన్నో వింతపనులు చేస్తుందని పత్రికలు ప్రచురించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు డాక్టర్లు, విమర్శకులు, రచయితలు ఆ ఇంటికివెళ్ళారు. ఇంటి యజమాని కెంట్ వారితో “ఆ దయ్యం ఎవరోకాదనీ, ఇటీవలనే మరణించిన తన భార్యే దయ్యమై పీడిస్తుందనీ, సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చి అనరాని మాటలు అంటూందనీ మొత్తుకున్నాడు,ఇంతలో ఎనిమిది అయింది. అందరూ చెవులు రిక్కబొడుచుకొని దయ్యం ఎటువైపు నుండి వస్తుందా ఆని జాగ్రత్తగా చూస్తున్నారు. చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దంగా ఉంది ఆ గదిలోని వాతావరణం. హఠాత్తుగా ‘మిస్టర్ కెంట్ అనే పిలుపు వినబడింది,

అంతే అక్కడున్న వారిలో కొందరు కంగారు పడి అటూ ఇటూ చూశారు.

కొందరికిభయం కూడా వేసింది. ఇంతలో మళ్ళీ “కెంట్ నువ్వు నన్ను విషం పెట్టి చంపావు. నేను నిన్ను క్షమించను. నువ్వు నా కూతుర్ని చంపడానికి పన్నాగం పన్నుతున్నావు. కానీ, నీ ఆటలు సాగవు. నీ అంతు తేలుస్తాను”అన్నది.

ఆ తరువాత మాటలు లేవు. అది విన్న ఇద్దరు రచయితలకి ఒళ్ళంతా చెమటు పట్టేశాయి. ఒక వ్యక్తి సృహతప్పి పడిపోయాడు. ధైర్యం ఉన్నవాళ్ళూ, హేతువాదం మీద నమ్మకం ఉన్నవాళ్ళూ గది అంతా పరికించి చూశారు. ఎక్కడైనా టేప్ రికార్డర్లలాంటి సాధనాలు ఉన్నాయేమోనని పరీక్షించారు. అటువంటివేమీ కనపడలేదు. ఈ సంఘటనను ఇదే ప్రకారంగా నాలుగు సార్లు వరుసగా చూసిన ప్రఖ్యాత డాక్టరూ, రచయితా అయిన సామియేల్ జాన్సన్ ఈ విషయంపై పూర్తినమ్మకం కలిగిన తరువాత ఒక పెద్ద నవల వ్రాసి, “కేవలం యదార్థ సంఘటనలతో కూడిన మొట్టమొదటి నవల’ అనే పబ్లిసిటీతో విడుదల చేశాడు. అది దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోయింది. ఆ నవలపై ప్రజలకు రోజురోజుకూ మోజు పెరుగుతున్నా, కొందరు పారా సైకాలజిస్టులు మాత్రం దేశం అన్యాయంగా మూఢ నమ్మకాలకు బలి అయిపోతుందని వాపోయారు. సైన్స్ కి దొరకని నిగూఢ రహస్యాలు ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయి..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Subscribe

Verified by MonsterInsights