రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..! 9.89 లక్షల మందికి ప్రయోజనం..

తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామా క్రమబద్ధీకరణ ద్వారా 9.89 లక్షల రైతులకు శుభవార్త అందించింది. 1970ల అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేస్తూ, సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇది రైతులకు రుణాలు, వారసత్వం, విక్రయం, భూమి రక్షణలో సహాయపడుతుంది.
అయితే 2020 నవంబర్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించారు. కానీ ఆర్.ఓ.ఆర్. చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది. దాదాపు 9.89 లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుగమమైంది. తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల సాదాబానామాలకు దరఖాస్తు చేసుకున్న 9.89 లక్షల మందికి లబ్ధిపొందనున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం రైతులకు పలు విధాలుగా ఉపయోగపడనుంది. భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతారు. తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వారసత్వం, విక్రయం, భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలు తలెత్తవు. భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి, దళారుల జోక్యం తగ్గే అవకాశముంది.
