This is the situation for two more days in Hyderabad…హైదరాబాద్ వర్షాలు.. మరో రెండు రోజులూ..

This is the situation for two more days in Hyderabad…….
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు నగరంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
మాదాపూర్‌లో, కూకట్ పల్లి ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. మదాపూర్, జూబ్లీహిల్స్‌లలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో నాలుగు గంటల్లోనే 70 మి.మీ.కు పైగా వర్షపాతం కురిసింది. ఐటీ సంస్థలు ఉన్న మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Source:https://telugu.samayam.com/telangana/news/hyderabad-weather-update-drizzle-in-the-city-for-next-two-days-says-imd/articleshow/71386747.cms
